మళ్లీ లీడర్ అవతారంలో రానా.. యువనేతగా సూపర్బ్ | Rana-Teja New Movie First Look Poster Out.

Rana nene raju nene mantri first look out

Rana Daggubati, Nene Raju Nene Mantri Movie, Rana First look, Rana-Teja Movie first look, Nene Raju Nene Mantri first look, Rana as Jogendra, Rana Political Avatar, Rana KTR tweets, Director Teja new movie

Rana Daggubati first look as Jogendra in Nene Raju Nene Mantri Movie first look released.

రానా నేనే రాజు-నేనే మంత్రి ఫస్ట్ లుక్

Posted: 01/04/2017 01:08 PM IST
Rana nene raju nene mantri first look out

టాలీవుడ్ హంక్ రానా కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు.. నేనే మంత్రి సినిమా పోస్టర్ ను తన ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు. పూర్తిగా గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యువనేత జోగేంద్ర క్యారెక్టర్ లో ఈ ఆరడుగుల ఆజానుబాహుడు నటించనున్నాడు. కాజల్, కేథరిన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రస్తుతం అనంతపురంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. తన పార్టీ ప్రచారంలో రానా ఉత్సాహంగా పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే బాహుబలి, ఘాజీ సినిమాల షూటింగ్ పూర్తి చేసిన రానా, తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేనే రాజు.. నేనే మంత్రి షూటింగ్లో పాల్గొంటున్నాడు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కాస్త విరామం తీసుకున్న రానా తిరిగి షూటింగ్ పాల్గొన్నాడు.

ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న కొత్త సంవత్సరం తొలిరోజు షూటింగ్ లో ఫస్ట్ ఫోటో అంటూ ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేశాడు. లీడర్ తర్వాత రానా మరోసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో నటిస్తుండటం, పైగా ప్రేమకథల స్పెషలిస్ట్ తేజ దీనికి దర్శకుడు కావటంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rana Daggubati  Nene Raju Nene Mantri  Director Teja  First look  

Other Articles