చెర్రీ, మోక్షజ్నలు నిజంగా నటిస్తున్నారా? | Ram Charan yes and Mokshagna No cameo in father's movies.

Clarity on khaidi and satakarni guest roles

Ram Charan in Khaidi, Khaidi No 150, Gautamiputra Satakarni, Nandamuri Mokshagna, Mokshagna Satakarni, Khaidi and Satakarni guest roles, Chiru and Balayya sons, Ram Charan and Mokshagna

Ram Charan in Khaidi No 150 guest role, Bala krishna Son Mokshagna not debut with Satakarni.

గెస్ట్ రోల్స్ నిజంగా ఉన్నాయా?

Posted: 01/04/2017 01:52 PM IST
Clarity on khaidi and satakarni guest roles

టాప్ హీరోల సినిమాల రిలీజ్ సంగతి ఏమోగానీ, ప్రస్తుతం వారి వారసుల స్పెషల్ రోల్స్ గురించి ఇప్పుడు డిస్కషన్లు మొదలయ్యాయి. ఖైదీలో చెర్రీ, శాతకర్ణిలో నందమూరి మోక్షజ్న (డెబ్యూ) నటించబోతున్నారని కొంత కాలం నుంచి చెప్పుకుంటున్నాం. శాతకర్ణిలో మిగతా రోల్స్ రివీల్ అయినప్పటికీ, మోక్షజ్న క్యారెక్టర్ ఏంటా అన్నది ప్రశ్నగా మారింది. అయితే శాతకర్ణి కొడుకు లేదా మనవడి రోల్ లో కనిపిస్తాడని అప్పట్లో వార్తలు మాత్రం వినిపించాయి.

దీనిపై క్లారిటీ ఇస్తున్నాడు శాతకర్ణి మాటల రచయిత సాయి మాధవ్ క్లారిటీ ఇచ్చేశాడు. తాను సినిమా చూశానని, అందులో మోక్షజ్న క్యారెక్టర్ లేదని తేల్చేశాడు. దీంతో నందమూరి వారసుడి ఎంట్రీ బాలయ్య వందో చిత్రంతోనేనన్న పుకారుకి పుల్ స్టాప్ పడినట్లయ్యింది.

Nandamuri Mokshagna not in Satakarni

ఇక మరోవైపు ఖైదీ నంబర్ 150లో మెగా తనయుడు రామ్ చరణ్ కూడా క్యామియో చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇది ఎలాంటి రోల్ అనే ఆలోచన మెగాఫ్యాన్స్ లో ఉన్నా.. ఓ రకమైన క్లారిటీ ఉంది. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు పాటలో చరణ్ కనిపిస్తాడని, 30 సెకన్ల పాటు ఈ సందడి ఉండబోతుందని తెలుస్తోంది.

Charan Dance in Khaidi

 

పాట గురించి చెప్పకపోయినా గెస్ట్ రోల్ గురించి మాత్రం తేల్చేశాడు మెగా పవర్ స్టార్. మరోవైపు చిరు బుల్లితెర డెబ్యూ మీలో ఎవరు కోటీశ్వరుడు ఈ సంక్రాంతి నుంచి ప్రారంభం అవుతుండగా, మెగాస్టార్ 150 సినిమాల్లో అన్నిటికీ కలిపీ ఒకేసారి ట్రిబ్యూట్ ఇస్తూ 'MEGA 150' పేరుతో డిజైన్ చేసిన ఓ గేమ్ త్వరలో విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Khaidi No 150  Nandamuri Mokshagna  Gautamiputra Satakarni  Guest Roles  

Other Articles