అఫైర్ ఉన్నా వాళ్లిద్దరికీ ఆమెతో అభ్యంతరం లేదు | Katrina and Aditya's Friendship not bothering Ranbir.

Adithya and ranbir are still great friends

Katrina Kaif, Aditya Roy Kapur, Ranbir Kapoor, Aditya Roy Kapur meet Ranbir Kapoor, Aditya Roy Kapur on relationship with Katrina, Katrina about Adithya and Ranbir, Katrina Kaif relationship, Adithya and Ranbir are still great friends

Ranbir Kapoor unaffected by Katrina Kaif and Aditya Roy Kapur's growing friendship.

అఫైర్ ఉన్నా... వాళ్లిద్దరు ఇప్పటికీ ఫ్రెండ్సే...

Posted: 01/05/2017 01:39 PM IST
Adithya and ranbir are still great friends

బాలీవుడ్ లో ఇద్దరు యవహీరోల మధ్య ఆమె పెట్టిన చిచ్చు అంటూ గత కొంత కాలంగా వస్తున్న వార్తలపై కత్రినా కైఫ్ మండిపడింది. తన మూలంగా రణ్ బీర్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్ ల మధ్య గొడవలు చెలరేగి విడిపోయారంటూ వస్తున్న వార్తలపై కాట్ స్పందించింది. వారిద్దరు ఇప్పటికీ మంచి మిత్రులుగానే ఉన్నారని, లేనిపోని వార్తలు రాసి అనవసరమైన రాద్ధాంతం చేయొద్దని మీడియాకు తెలిపింది.

కాగా, ఈ యే జవానీ హై దివానీ కోస్టార్స్ సినిమా తర్వాత మరింత మంచి ఫ్రెండ్స్ అయ్యారు. రణ్ బీర్ తో బ్రేక్ అప్ అయ్యే నాటికి ఆదిత్యరాయ్ తో ఫితూర్ సినిమాలో కత్రినా నటించింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య బాండ్ ఏర్పడటం, అది కాస్త ముదిరి క్లోజ్ బాండ్ గా మారిపోవటం తెలిసిందే. అందుకే రణ్ బీర్ కొత్త ఇంటి పంక్షన్ కి ఆదిత్య డుమ్మా కొట్టాడంటూ కథనాలు వెలువడ్డాయి.

దానికి తోడు అదే సమయంలో కత్రినా ఇంట్లోకి ఆదిత్యరాయ్ వెళ్తున్న ఫోటోలు దానిని మరింత బలపరిచాయి. అంతేకాదు క్రమం తప్పకుండా వారం వారం బాంద్రాలో సాకర్ మ్యాచ్ లు ఆడే వీళ్లు ఈ మధ్య కనిపించటం లేదు. దీంతో వీరిద్దరూ విడిపోయారన్నది కన్ఫమ్ అయినట్లు చెప్పుకొచ్చారు. కానీ, ప్రస్తుతం జరుగుతున్న సీన్ లు వాస్తవం ఏంటో చూపిస్తున్నాయి.

 

రీసెంట్ గా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదిత్యరాయ్ కత్రినాతో సీక్రెట్ డేటింగ్ వార్తలను ఖండించాడు. స్నేహితులతో డిన్నర్ కి వెళ్లినా, ఇంటికి వెళ్లినా మీ ఇష్టం వచ్చినట్లు రాయకండి. అవతలి వాళ్ల పరిస్థితి, అభిప్రాయం కూడా తీసుకోండి అంటూ చురకలు అంటించాడు. ఇక ఈ మధ్యే రణ్ బీర్ కొత్త ఇంటికి ఆదిత్య వెళ్లగా, ఆదిత్య నటించిన ఓకే జాను సినిమాను రణ్ బీర్ ప్రమోట్ చేస్తూ ఎప్పటిలాగే మెలుగుతూ గొడవలనే రూమర్లకు చెక్ పెట్టేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katrina Kaif  Ranbir Kapoor  Aditya Roy Kapur  friendship  

Other Articles