సినీ వారసుల ఆరంగ్రేటం కోసం వారి వారి అభిమానులు ఎదురు చూడటం సహజమే. ల్యాండ్ మార్క్ 100వ చిత్రం అయిన శాతకర్ణితో చారిత్రాత్మక విజయం అందుకున్న బాలయ్య విషయంలోనూ నందమూరి ఫ్యాన్స్ అదే కోరుకుంటున్నారు. నట వారసుడిగా మోక్షజ్న ఎప్పుడు వస్తాడో అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారనటంలో అతిశయోక్తి లేదు. నిజానికి శాతకర్ణిలోనే యువరాజు పాత్రలో కనిపిస్తాడని చెప్పుకున్నప్పటికీ, అది కుదరలేదు. కానీ, ఈ సినిమా కోసం తన వారసుడు పని చేశాడని మాత్రం చెబుతున్నాడు బాలయ్య.
అవును... గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు దర్శకత్వ విభాగంలో సహయకుడిగా మోక్షజ్న కొన్ని రోజులు పని చేశాడంట. తాజాగా శాతకర్ణి థాంక్ యూ మీట్ లో బాలయ్య ఈ విశేషాన్ని చెప్పుకోచ్చాడు. డెబ్యూ గురించి అడిగిన మీడియా ప్రశ్నకు బదులిస్తూ... ప్రస్తుతం బీబీఏ కోర్సు చేస్తున్న మోక్షజ్న సినిమాలోకి రావటానికి ఇంకా టైం ఉందని చెప్పుకోచ్చాడు. ఎన్టీఆర్ కొన్ని సినమాలకు దర్శకత్వం వహించారు కదా? మరి మీరు మెగా ఫోన్ పట్టే ఆలోచన ఉందా? అడగ్గా... ప్రస్తుతానికైతే ఆ ఆలోచన లేదు. ఎప్పుడైతే తన క్రియేటివిటికి తగ్గట్లు చేసే దర్శకుడు దొరకడో, అప్పుడు తానే మైక్ అందుకుని దర్శకత్వం చేస్తానని బాలయ్య బదులిచ్చాడు.
తన తండ్రి అయిన ఎన్టీఆర్ నుంచి ఎలాగైతే నటనను తాను పుణికిపుచ్చుకున్నానో.. నా తనయుడు కూడా నా సినిమాలు చూసి, నా స్టైల్ ను చూసి పెరిగాడు. భగవంతుని కృప వల్ల సరైన సమయంలోనే సినిమాలోకి ఎంటర్ అవుతాడు డెబ్యూ ఇప్పట్లో ఉండబోదని తేల్చేశాడు బాలయ్య. కాగా, శాతకర్ణి సినిమాకు సీక్వెల్ ఉంటుందని, వశిష్టపుత్ర పులోమావి గా మోక్షజ్న నటించబోతున్నాడని కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వెంకీ, అక్షయ్ కుమార్ సినిమాల ఫ్లాన్ లో ఉన్న క్రిష్ తర్వాత నందమూరి నటవారసుడిని డైరక్ట్ చేస్తారని టాక్ కూడా వినిపించింది.
చిరు నా బెస్ట్ ఫ్రెండ్.. ఆ వాదన అంగీకరించను...
శాతకర్ణి సక్సెస్ లో ఉన్న బాలయ్య మీడియాతో పిచ్చాపాటి లో బోలెడు విషయాలనే చెప్పుకొస్తున్నాడు. మీకు కోపం ఎక్కువ అనే వాదనతో ఏకీభవిస్తారా? అని ప్రశ్నించగా, తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు బాలయ్య. "నాకు కోపం ఎక్కువని చాలా మంది అనుకుంటుంటారు. అందులో ఏమాత్రం నిజం లేదు. వాస్తవానికి నేను చాలా సరదాగా ఉంటా. ప్రజలందరితో చాలా త్వరగా కలసిపోతా. ఇంట్లో కూడా తన పిల్లలు తనను ఇమిటేట్ చేస్తే నవ్వుతూ సంతోషిస్తా. నా సినిమాల గురించి కుటుంబ సభ్యులు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను చెబుతుంటారు", అని సమాధానమిచ్చాడు.
ఇక ఎమ్మెల్యేగా, బసవతారకం ఆసుపత్రి పెద్ద దిక్కుగా బాధ్యతలను నిర్వహిస్తూ తాను చాలా బిజీగా ఉన్నానని... అందువల్ల సినీ పరిశ్రమలో సైతం తనకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరని చెప్పారు. తనకు అత్యంత సన్నిహితుడు మాత్రం ఒక్క చిరంజీవే అని తెలిపాడు. తన సినిమాతోపాటు చిరు సినిమా కూడా ఆడుతుండటం చాలా సంతోషమని చెప్పాడు కూడా.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more