ఖుల్లం ఖుల్లా పేరుతో తన స్వీయ చరిత్ర పుస్తకం, పైగా అన్ సెన్సార్ పేరు మూలానా ఏమో సీనియర్ నటుడు రిషి కపూర్ బాంబుల మీద బాంబులు పేలుస్తున్నాడు. ఇప్పటికే తండ్రి అఫైర్ల గురించి, కొడుకు రణ్ బీర్ తో సక్రమైన రిలేషన్ లేకపోవటం, 30 వేలు పెట్టి బాబీ సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కొనటం ఇలా చాలా సంచలనాలే అందులో పేర్కొన్నాడు. ఇక ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరిన్ని విషయాలను వెల్లడించాడు.
ఏకంగా అమితాబ్ బచ్చన్ నే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో అమితాబ్ యాంగ్రీ యంగ్ మన్, అతని కోసమే కథలు, సినిమాలు పుట్టుకొచ్చేవి. అలాంటి వ్యక్తి సినిమా సక్సెస్ అయితే మాత్రం ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలోనే వేసుకునే వాడు. అంతేకాదు తనతోపాటు నటించిన కో-స్టార్లను బిగ్ బీ చిన్న చూపు చూసేవాడని, సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ నేరం ఇతరుల మీదకు నెట్టేసే గుణం ఉందంటూ కాస్త ఘాటుగానే తెలిపాడు. ఆ సమయంలో మేమూ చిన్న పాత్రలు పోషించాం, ఆపై స్టార్ డమ్ వచ్చింది. కానీ, ఎన్నడూ అమితాబ్ లా మాత్రం ప్రవర్తించలేదంటూ వివరించాడు.
ఇక ఓ బాలీవుడ్ మున్నాభాయ్ సంజయ్ దత్ కు తనకు జరిగిన ఓ ఫైట్ గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు. కర్జ్ సినిమా చేస్తున్న సమయంలో టీనా (అనిల్ అంబానీ భార్య) తో క్లోజ్ నెస్ చూసి అఫైర్ అంటగట్టారంట. అప్పటికీ రిషికి ఇంకా పెళ్లి కాలేదు. ఇంకోవైపు టీనా మాత్రం తన రాకీ సినిమా హీరో అయిన సంజయ్ దత్ లు ప్రేమలో ఉంది. రూమర్ గురించి తెలిశాక రిషిపై కోపంతో మరో నటి నీతూ సింగ్(రిషి కపూర్ భార్య) అపార్ట్ మెంట్ కు సీరియస్ గా వెళ్లాడంట. అయితే వివాదం పెద్దది కాకుండా నీతూ సంజయ్ కి సర్ది చెప్పిందంట.
టీనా-చింటూ(రిషి) మంచి ఫ్రెండ్స్ మాత్రమే. ఇండస్ట్రీలో ఉంటున్నావ్ ఇలాంటి వ్యవహారాలు మనకు కొత్తేం కాదు కదా అని సర్ది చెప్పిందంట. ఆ విషయాన్ని మరో నటుడు గుల్షన్ గ్రోవర్ గుర్తు చేయటం, సంజయ్, రిషిలు నవ్వుకోవటం కూడా జరిగిపోయాయి. ఆ తర్వాత సంజయ్ దత్ డ్రగ్స్ పెద్ద మొత్తంలో తీసుకోవటం, టీనా అతనికి, సినిమాలకు గుడ్ బై చెప్పి చివరకు బిజినెస్ టైకూన్ అంబానీ ఇంటి కొడలు జరిగిపోవటం తెలిసిందే. ఈ విషయాలు ఒక్కోక్కటిగా వెలుగు చూస్తుండటంతో బాలీవుడ్ వర్గాలు ఇంకెన్ని బయటపడతాయో అని ఆసక్తిగా చూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more