మెగా హీరో కోసం సితారను వదులుతున్నాడు | Mahesh Babu Releases Sitara for Mega hero.

Superstar starts sai dharam tej winner campaign

Mahesh Babu, Sai Dharam Tej, Sai Dharam Tej Winner Movie, Mahesh Babu Mega Hero, Mahesh Babu Sai Dharam Tej, Sai Dharam Tej Winner Songs, Sitara Song Mahesh Babu, Mahesh Babu Release Sitara Song, Mahesh Babu Winner Movie, Sitara Song, Mahesh Babu Rakul Sai Dharam Tej

Mahesh Babu Releases Sitara song from Sai Dharam Tej's Winner.

మెగా హీరో సినిమాను ప్రమోట్ చేస్తున్న మహేష్

Posted: 02/01/2017 06:01 PM IST
Superstar starts sai dharam tej winner campaign

తమ అభిమానుల వార్ కంటిన్యూ అవుతున్నప్పటికీ, హీరోలంతా ఫ్రెండ్లీ వాతవరణంలోనే ముందుకు సాగుతున్నారు. పైగా ఈ మధ్య ఒకరి సినిమాలకు ఒకరు సహకరించుకోవటం కూడా చూస్తున్నాం. వాయిస్ ఓవర్ దగ్గరి నుంచి ఇతరుల సినిమాలను ప్రమోట్ చేయటం దాకా తమ వంతు సహకారాన్ని అందిస్తు అటువైపు ఉన్న హీరోల అభిమానుల నుంచే కాదు, సొంత అభిమానుల నుంచి కూడా మెప్పు పొందుతున్నారు.

ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ విషయంలో ముందుంటున్నాడు. తన ఫ్యామిలీ హీరోలతోపాటు, అఖిల్, నాని లాంటి యంగ్ స్టర్స్ సినిమాల పంక్షన్లకు హాజరవ్వటం, చిన్న హీరో సినిమాల ఫస్ట్ లుక్ లు, టీజర్ లు విడుదల చేయటం చూశాం. ఇక ఇప్పుడు ఏకంగా మెగా ఫ్యామిలీ హీరో సినిమాను ప్రమోట్ చేయబోతున్నాడు. తాను నటించిన 'విన్నర్' సినిమాలోని పాటను రిలీజ్ చేయబోతున్నట్లు సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ లో సంతోషం వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం మురగదాస్ మూవీ షూటింగ్ లో ఉన్న మహేష్ సెట్స్ నుంచే ఈ పాటను రిలీజ్ చేయబోతున్నాడని సమాచారం. 'సితార' అనే లిరిక్స్ కావటంతోనే మహేష్ తో ఈ పాటను రిలీజ్ చేయిస్తోంది చిత్ర యూనిట్. కాగా, అందరివాడిగా మారిపోయిన సాయి ఆటిట్యూడ్ ను గతంలో మహేష్ పొగడటం, పైగా విన్నర్ లో రకుల్ హీరోయిన్ కావటంతో  అందుకు మహేష్ కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది. కాసేపట్లో ఆ పాట విడుదల కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Sai Dharam Tej  Winner Movie  Siatara Song  

Other Articles