సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలన్న ఉద్దేశ్యంతో అతి పోస్టులు పెట్టడం, ఆపై ఇబ్బందులు ఎదుర్కోవటం మన సెలబ్రిటీలకు కొత్తేం కాదు. రీసెంట్ గా ఓ బుల్లితెర నటి కూడా ఇలాగే ఇబ్బందుల్లో చిక్కుకుంది.
బాలీవుడ్ లో ‘నాగార్జున’ ఏక్ యోధ అనే ఓ డైలీ సిరీయిల్ టెలికాస్ట్ అవుతోంది. ఇందులో నటిస్తున్న నటి శ్రుతి ఉల్ఫత్ ప్రాణంతో ఉన్న నాగుపామును తన చేతిలో పట్టుకుని ఫోటో దిగింది. అంతేనా మెడలో కూడా వేసుకుని ఫోటోలు, వీడియో తీయించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతే వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు మండిపడుతూ ఆమెపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శ్రుతి సహా మరో నటి, ఇద్దరు ప్రొడక్షన్ మేనేజర్లను పోలీసలు ముంబయిలో నిన్న అరెస్టు చేశారు.
తొలుత ఒరిజినల్ పాము కాదని సీరియల్ యూనిట్ బుకాయించటంతో ఫోరెన్సిక్ ల్యాబ్ కు వీడియోను పంపించారు. పరీక్షల్లో నిజమని తేలటంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తమ తప్పును అంగీకరించారు. అయితే పాముకు హని కలిగించినట్లు ఎక్కడా వీడియోలో లేకపోవటంతో వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 ప్రకారం ఒక్కరోజు కస్టడీకి తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులను కోర్టు ఆదేశించటంతో అరెస్ట్ చేయగా, ఆపై ఆమెకు బెయిల్ మంజూరు చేశారు. తానేం కావాలని అలా చేయలేదని, సెట్ లో సరదాగా అలా ఫోటోలు దిగాల్సి వచ్చిందని చెబుతోందీ జమైరాజ్ సీరియల్ ఫేమ్ నటి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more