25 ఏళ్ల కెరీర్.. 11 సార్లు నామినేట్.. పైగా స్టార్ హీరో.. అయినా అవార్డు రాలేదు | In 25 years carrier this star hero not deserve any award.

Akshay kumar breaks his silence on filmfare award

Akshay Kumar, Filmfare Best Actor Award, Akshay Kumar Filmfare, Filmfare Awards 2016, Filmfare Best Hero, Akshay Kumar on Filmfare Awards, Airlift and Rustom, Akshay Kumar Awards

Akshay Kumar reveals why he didn't get a Filmfare Best Actor award. He hasn't won a Filmfare Best Actor award in his 25-year career because he 'maybe doesn't deserve it.

అవార్డుల పై అక్షయ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Posted: 02/10/2017 10:06 AM IST
Akshay kumar breaks his silence on filmfare award

తమకు అవార్డులు రాకపోవటంతో స్టేజీల మీదకు అక్కసు వెల్లగక్కుతూ రచ్చ చేసిన నటీనటులను చాలా మందినే చూశాం. అయితే 25 ఏళ్ల కెరీర్ లో ఏనాడూ కూడా అవార్డు రాకపోవటం వెనుక ఆ స్టార్ హీరోకి కొంచెం కూడా బాధ లేదంట. పైగా అసలు అవార్డులకు తాను అర్హుడిని కాదేమో అని కూడా అంటున్నాడు అక్షయ్ కుమార్. బేబీ, స్పెషల్ ఛబ్బీస్, ఎయిర్ లిఫ్ట్ లాంటి ప్రయోగాత్మక కథలతోనే కాదు, హౌస్ ఫుల్ లాంటి కామెడీ యాక్షన్ చిత్రాలతో అలరించే ఈ కిలాడీకి అసలు ఎందుకు అవార్డులు రావు అన్న డౌట్ ఎవరికైనా కలగక మానదు.   

సుమారు పాతికేళ్ల కెరీర్ లో అక్షయ్ కుమార్ ఏనాడూ బెస్ట్ హీరోగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకోలేదు. 1995 నుంచి సినిమాలు చేయటం ప్రారంభించిన అక్కీ 11 సార్లు నామినేట్ అవ్వటం ఇక్కడ విశేషం. మధ్యలో రెండుసార్లు అవార్డులు గెలుచుకున్నప్పటికీ అది హీరోగా మాత్రం కాదు. 2002లో అజ్ నబీ చిత్రానికి బెస్ట్ విలన్, 2006 లో గరమ్ మసాలాకు బెస్ట్ కమెడియన్ గా ఫిల్మ్ ఫేర్ అందుకున్నాడు. అయినా సోషల్ మెసేజ్ ఓరియంటల్ చిత్రాల్లో ఎక్కువగా నటించే అక్షయ్ విషయంలోనే ఎందుకిలా జరుగుతుందన్న దానిపై తన లేటెస్ట్ చిత్రం జానీ ఎల్ ఎల్ బీ-2 ప్రమోషన్ సందర్భంగా స్పందించాడు.

నేను చేసే సినిమాలు ఎక్కువగా ఎంటర్ టైన్ మెంట్ తోపాటు సామాజిక సందేశంతో కూడుకుని ఉంటాయి. వాటిని నేను చాలా గర్వంగా ఫీలవుతాను. కానీ, తెరపై నన్ను నేను చూసుకున్న తర్వాత కూడా వాటికి అవార్డులు రాకపోవటం ఒక్కోసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయినా అది ఆలోచిస్తే మున్ముందు ఇలాంటి సినిమాలు తీయలేను కదా. అందుకే ఆలోచించటం మానేశా అంటూ తెలిపాడీ 49 ఏళ్ల యాక్షన్ హీరో. గతేడాది ఎయిర్ లిఫ్ట్, రుస్తుం లాంటి ఫెర్ ఫార్మెన్స్ బేస్ డ్ చిత్రాలు తీసినప్పటికీ, అక్షయ్ కు ఈ దఫా కూడా అవార్డు దక్కలేదు. అయితే నామినేషన్ లలో అక్షయ్ పేరు కాకుండా సుల్తాన్ హీరో సల్మాన్ ఖాన్ పేరు ఉండటంపై సోషల్ మీడియాలో తీవ్ర ఎత్తున నిరసన వ్యక్తం చేశారు అక్షయ్ అభిమానులు. చివరకు అవార్డు మాత్రం దంగల్ సినిమాకు గానూ అమీర్ ఖాన్ కు దక్కింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akshay Kumar  Filmfare Awards  2016  

Other Articles