తమిళ రాజకీయాలను శాసించిన నేతలంగా కోలీవుడ్ నుంచే తమ ప్రస్థానం మొదలుపెట్టిన వారన్న విషయం తెలిసిందే. గ్లామర్ ఫీల్డ్ లో ఉండగానే అశేష అభిమానులను ఏర్పరుచుకుని, ఆపై వారి అండ దండలతోనే ముందుకు సాగారు కూడా. జయ నిష్క్రమణ తర్వాత పరిస్థితి మరీ అధ్వానంగా తయారయ్యింది. ప్రస్తుతం అక్కడ పన్నీర్ సెల్వం వర్సెస్ శశికళ అంటూ... నాటకీయ పరిణాలమాలు జరుగుతున్నాయి. అయితే దీనికి ముందే గత కొంతకాలంగా తలైవా పొలిటికల్ ఎంట్రీ మీద ఆసక్తికర చర్చ మొదలైన విషయం తెలిసిందే.
ఆయన త్వరలో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారని.. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని.. సూపర్ స్టార్ కొత్త పార్టీని పెట్టబోతున్నారని.. ఇందుకు ఆర్ ఎస్ఎస్ నేత ఒకరు సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్ బీ అమితాబ్ కు ఓ ఉచిత సలహా ఒకటి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. గతంలోతాను రాజకీయాల్లోకి వచ్చానని.. అయితే.. రాజకీయాలుతనకు ఇమడక వాటిల్లో నుంచి బయటకు వచ్చేసినట్లుగా చెప్పటమే కాదు.. రజనీని రాజకీయాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పటం గమనార్హం. దీనిపై సూపర్ స్టార్ స్పందించకున్నా.. అమితాబ్ మాటల తర్వాత కాస్తంత ఆలోచనల్లో పడినట్లుగా చెబుతున్నారు. రజనీపై కన్నేసిన కాంగ్రెస్
మరోవైపు విలక్షణ నటుడు కమల్ హాసన్ తమిళ రాజకీయాలపై అంతే విలక్షణంగా స్పందిస్తున్నాడు. తాను రాజకీయాల్లోకి రాకూడదని ప్రతి ఒక్కరు కోరుకోవాలని సూచించారు. ఒకవేళ తాను కనుక రాజకీయాల్లో అడుడుపెడితే రచ్చరచ్చేనని హెచ్చరించారు. ఇప్పటి వరకైతే తనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని పేర్కొన్న ఆయన వస్తే మాత్రం అది మామూలుగా ఉండదన్నారు. ఓ పత్రికకు ఇచ్చి ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
ఆరు దశాబ్దాలుగా తమిళనాడుకు రాజకీయ నాయకులు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన శశికళ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఉన్న అర్హతలు తనకే కాదు, ప్రజలకు కూడా తెలియదని కమల్ పేర్కొన్నారు. ఒక వ్యక్తి చుట్టూ ఏళ్లపాటు తిరగడం అర్హతగా భావించకూడదన్నారు. తాను ఒక న్యాయవాది కుమారుడినని, అంతమాత్రాన తాను కోర్టులో ఏదైనా కేసులో వాదన వినిపించేయగలనని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందన్నారు. ‘మీ ఆవేశం చూస్తుంటే మీలో ఒక ఔత్సాహిక రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు’ అన్న ప్రశ్నకు కమల్ విలక్షణంగా స్పందించారు. తానలా అనుకోవడం లేదన్నారు. మీకు కనుక దేవుడిపై నమ్మకముంటే తాను రాజకీయాల్లోకి రాకుండా ఉండాలని కోరుకోవాలంటూ సలహా ఇచ్చాడు. తమలాంటి వాళ్లు చాలా ఆగ్రహంగా ఉన్నారని, రాజకీయాల్లో అడుగుపెడితే మామూలుగా రామని, తుపాకులు చేతపట్టుకుని వస్తామంటూ సంచలన వ్యాఖ్యలే చేశాడు.
ఓవైపు కోలీవుడ్ మొత్తం ఏకపక్షంగా పన్నీర్ సెల్వంకు మద్ధతు ప్రకటించిన వేళ, తమిళనాడు రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ ఇద్దరు సూపర్ స్టార్ల వ్యవహార శైలి ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more