శ్రీదేవీ కూతుళ్ల సెల్ఫీ బ్యాన్... మరీ టూమచ్ | Sridevi banned daughters for clicking selfies.

Sridevi new condition to daughters

Sridevi New Rule, Sridevi Daughters, Sridevi Daughters Jhanvi And Khushi, Jhanvi And Khushi Selfies, Jhanvi And Khushi New Photos, Jhanvi And Khushi New Avatar, Jhanvi And Khushi Hot Selfies, Sridevi Daughters Movie, Jhanvi Kapoor Selfies, Jhanvi Kapoor Hot, Jhanvi Kapoor Boy Friends, Jhanvi Kapoor Debut

Sridevi New Rule to Daughters. Banned Jhanvi And Khushi For Posting And Clicking Selfies in Social Media.

కూతుళ్లకి కొత్త కండిషన్ పెట్టిన శ్రీదేవి

Posted: 02/11/2017 04:02 PM IST
Sridevi new condition to daughters

తల్లి ఎవర్ గ్రీన్ బ్యూటీ అయినప్పటికీ కూతురు మాత్రం ఆరంగ్రేటం ముందు నుంచే డేటింగ్ తో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఇద్దరేసి బాయ్ ప్రెండ్స్ తో అఫైర్లు.. పైగా మూతి ముద్దులతో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇదంతా అతిలోక సుందరి (మాజీ) శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించే... కెరీర్ కి రాకముందే వాళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తూ కూతుళ్లతో పోటీపడి మరీ ఫోజులిచ్చి ఈ సీనియర్ నటి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

అయితే ఇకపై అలాంటి వేషాలు కుదరవంట. ఇప్పటికే బాయ్ ఫ్రెండ్స్ లాంటి వేషాలు కట్ చేసుకోమ్మని చెప్పిన శ్రీదేవి, ఇకపై సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండాలంటూ గట్టిగానే చెప్పిందని తెలుస్తోంది. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లో ఫోటోలతో సందడి చేసే కూతుళ్లు జాన్వీ అండ్ కుషీ కపూర్ లకు, ముఖ్యంగా పెద్ద కూతురు 20 ఏళ్ల జాన్వీకి ఇకపై అలాంటివి చేయొద్దంటూ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టేసింది శ్రీదేవి. ఇప్పటికే జాన్వీ ఎలా ఉంటుందో తెలిసిపోయినప్పటికీ, ఆరంగ్రేటం కి సిద్ధమౌతున్న నేపథ్యంలో కొంతకాలం ఎవరికంట పడకుండా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది.

బయట తెగతిరిగే జాన్వీ లుక్స్ ఎప్పటికప్పుడు బైటకు వచ్చేస్తుండడంతో.. కూతురు ఎలాంటి హైప్ క్రియేట్ అవదని, కూతురి కెరీర్ ను తీర్చిదిద్దే క్రమంలో అందుకే ఇలాంటి కండిషన్ పెట్టిందని చెప్పుకుంటున్నారు. అన్నట్లు షాహిద్ కపూర్ తమ్మడు ఇస్తమ్ కట్టర్ తో జోడీగా డెబ్యూ చేయబోతుందన్న ఓ వార్త మాత్రం వినిపిస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Sridevi  Daughters  Jhanvi Kapoor  Kushi Kapoor  

Other Articles