మెగా స్టార్ ‘ఆటో’ జానీ మూమెంట్ | Chiranjeevi Auto Ride in MEK.

Megastar chiranjeevi auto ride for fan

Chiranjeevi Auto Johny, Meelo Evaru Koteeswarudu Host Chiranjeevi, Chiranjeevi Auto Ride, MEK Chiru, Chiranjeevi Auto Driver, Megastar Auto Ride, Chiranjeevi Satish, Chiranjeevi Auto Driver, Chiranjeevi Auto, Chiranjeevi rare Moments

Chiranjeevi is hosting 'Meelo Evaru Koteeswarudu's fourth season. An auto driver named Satish, who hailed from Medchal of Hyderabad, attended the show as a contestant yesterday. Satish wished that Chiranjeevi would travel in his auto so that he wouldn't be bothered if he couldn't win Rs.1 crore. The Megastar hasn't disappointed the wish of the poor auto driver. He traveled certain distance in the audio of Satish near Annapurna Studios bringing laurels to the auto driver.

అభిమాని కోసం ఆటో ఎక్కేసిన మెగాస్టార్

Posted: 02/17/2017 10:52 AM IST
Megastar chiranjeevi auto ride for fan

బుల్లితెరపై సందడి చేయటం ప్రారంభించిన చిరంజీవి ఆ అంచనాలను అందుకునే పనిలో పడ్డాడు. నాగ్ నుంచి యాంకరింగ్ బాధ్యతలను లాగేసుకున్న మెగాస్టార్ జనాకర్షణ ఎక్కువగా ఉండే షో కావటంతో అందుకు తగ్గట్లుగానే జనరల్ పనులు చేయటం ప్రారంభించాడు కూడా.

నిన్న జరిగిన మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్ లో సతీష్ అనే ఒక కంటెస్టంట్ హాట్ సీట్లోకి వచ్చాడు. అతగాడు స్వతాహాగా హైదరాబాద్ మేడ్చల్ కు చెందిన ఒక ఆటో డ్రైవర్. అతను వచ్చిన సమయంలో తాను కూడా ఆటోజాని సినిమాలో ఆటో నడిపానని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఆ కంటెస్టంట్ మాట్లాడుతూ.. 'సార్ మీరు ఒక్కసారైనా నా ఆటో ఎక్కాలి' అంటూ రిక్వెస్ట్ చేశాడు. కోటి రూపాయలు కొట్టినా కొట్టకపోయినా కూడా.. నా ఆటో ఎక్కాల్సిందే అన్నాడు. దానితో ఎన్నో ఏళ్ళ తరువాత నిజంగానే చిరంజీవి ఆటో ఎక్కేశారు.

అలా చిరంజీవిని అన్నపూర్ణ స్టూడియోస్ క్యాంపస్ బయట బయట ఆటోలో తిప్పి.. సతీష్ చాలా ఆనందపడ్డాడు. రౌడీ అల్లుడు చిత్రంలో తాను ఆటో జానీ పాత్ర కోసం నిజంగానే ఆటో నడపానంటూ ఆ సందర్భంగా చిరు చెప్పుకొచ్చాడు. ప్రోగ్రాం కోసమే చేసిన ఫీట్ అయినప్పటికీ, అభిమాని కోసం చిరు చేసిన ఈ పని మాత్రం చాలా ఆకట్టుకుంది. ఇక షోలో సతీష్ లక్షా ఇరవై వేలు గెలుచుకోగా, అతని దీనావస్థ  గురించి తెలుసుకున్న చిరు పర్సనల్ గా మరో 2 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి...

చిరు యాంకరింగ్.. నాగ్ రీజన్ చెప్పేశాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meelo Evaru Koteeswarudu  Chiranjeevi  Auto Ride  

Other Articles