మహేష్ మురగదాస్ సినిమా ఆల్ మోస్ట్ చివరి దశకు చేరుకున్నప్పటికీ టైటిల్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇంకా ఫస్ట్ లుక్ విడుదల కానీ ఈ చిత్రం టైటిల్ విషయంలోనే సుమారు 6 నెలల కాలాయపన చేసేసింది. ఇంతకు ముందు హిందీ వర్షన్ టైటిల్ విషయంలో ఓ స్పష్టత వచ్చినట్లు లీక్ ల ద్వారా తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు ఈ చిత్ర టైటిల్ పై ఓ క్లారిటీ వచ్చేసినట్లే అనిపిస్తోంది.
తొలినాళ్లలో ఏజెంట్ శివ, మిస్టర్ శివ, వాస్కోడిగామా ఇలా రకరకాల టైటిళ్లు వినవచ్చిన ఈ చిత్రం చివరకు సంభవామి అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకుంది. అయితే అది కేవలం హిందీ వర్షన్ కావటంతో తెలుగు, తమిళ్ టైటిళ్ల విషయంలోనే ఏంటన్నది ఓ స్పష్టత లేకుండా పోయింది. కానీ, స్టార్ ప్రొడ్యూసర్ పీవీపీ మహేష్ మూవీపై ఎట్టకేలకు హింట్ ఇచ్చేశాడు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈ చిత్ర నిర్మాతల్లో ఠాగూర్ మధు కూడా ఓ భాగస్వామిగా ఉన్నాడన్న విషయం తెలిసిందే. విన్నర్ ప్రీ రిలీజ్ ఆడియో పంక్షన్ లో మాట్లాడుతూ మధు ఈ యేడాది మూడు సినిమాలు నిర్మించబోతున్నాడని, అందులో ఒకటి విన్నర్ కాగా, రెండోది మిస్టర్ అని, ఇక చివరిది సంభవామి యుగే యుగే అని ప్రకటించాడు. ఈ మధ్యే సంభవామి అనే టైటిల్ గురించి లీక్ అందగా, బహుశా తెలుగు, తమిళ్ వర్షన్ ల కోసం సంభవామీ యుగే యుగే గా రిజిస్టర్ చేయించి ఉంటారని అర్థమౌతోంది.
మొత్తానికి తమ ఫేవరెట్ హీరో చిత్ర టైటిల్ విషయంలో ఇప్పటికీ ఓ స్పష్టత రావటంతో అభిమానులు పండగ చేస్కుంటున్నారు. కానీ, అది అధికారికంగా వెలువడేది మాత్రం ఫస్ట్ లుక్ తోనే సుమీ! ప్రస్తుతానికైతే టీజర్ ను సుమారు 30 లక్షల తో రూపొందించబోతున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more