శశికళ హర్రర్ క్లైమాక్స్... జయ ఆత్మ సమాధి నుంచి రావడమే... | Sasikala Movie Climax reveal by RGV.

Rgv on sasikal movie climax

RGV Sasikala Climax, Sasikala Movie, Jayalalithaa-Sasikala Relation, Jayalalithaa-Sasikala Movie, Ram Gopal Varma Mark Climax, Sasikala Horror Climax, Amma Jayalalithaa Ghost, Sasikala Movie Twist

Director Ram Gopal Varma makes shocking statements on Sasikala. Varma Shows real relation between Jayalalithaa-Sasikala in Sasikala Movie. In TN Horror politics the best climax would be Jayalalitha's ghost rising from grave.

శశికళ సినిమా.. క్లైమాక్స్ లో ఏం జరుగుతుందంటే...

Posted: 02/21/2017 11:39 AM IST
Rgv on sasikal movie climax

తమిళనాడు రాజకీయాలపై అప్ డేట్ లతో ట్వీట్లు చేస్తున్న వర్మ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించేశాడు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, అన్నాడీఎంకే జనరల్ సెక్రెటరీ శశికళ పేరుతో ఓ సినిమా తీయనున్నట్టు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు జయలలిత, శశకళల మధ్య ఉన్న బంధంలో ఎవరికీ తెలియని విషయాలను పోయెస్ గార్డెన్ లోని పనిమనిషి ద్వారా తెలుసుకున్న తాను ఈ సినిమాలో చూపిస్తానంటూ పెద్దపాటి చర్చేకే దారితీశాడు.

తాజాగా ఈ సినిమా గురించి ఆయన మరోసారి ఆసక్తికరమైన ట్వీట్లు చేశాడు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య జరుగుతున్న రాజకీయ నాటకంతో సమాధిలో ఉన్న జయ ఆత్మ శాంతిస్తుందా? అని ప్రశ్నిస్తూనే క్లైమాక్స్ ను రివీల్ చేసేశాడు. ఈ నాటకాలను తట్టుకోలేక పోయిన జయ ఆత్మ... సమాధిలో నుంచి బయటకు రావడమే తన సినిమాలో క్లైమాక్స్ అని తెలిపాడు. బతికున్నప్పుడు అమ్మ ఎంత పవర్ ఫుల్లో, చనిపోయి ఆత్మ అయ్యాక అంతకన్నా శక్తివంతంగా ఉన్నప్పటికీ శశికళకు కాకుండా, పన్నీర్ సెల్వంకు ఎందుకు సపోర్ట్ చేస్తుందో సినిమాలో చూపించబోతున్నట్లు సంకేతాలు అందించాడు.

మరోవైపు పరప్పణ అగ్రహార జైల్లో అధికారులతో శశికళ వాదిస్తూ... తానేమైనా చిల్ల దొంగనా? అని పోలీసులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా వర్మ స్పందించాడు. తాను చిల్లర దొంగను కాదు అన్న శశికళ ప్రకటనను చిల్లర దొంగలు, జేబు దొంగలు స్పూర్తిగా తీసుకోవాలని సూచించాడు. "అసలైన నేరం ఎవరిది? బతకడం కోసం రూ. 600 దొంగతనం చేసిన వారిదా? లేక తమ విలాసవంతమైన జీవితం కోసం... తమపై ఎంతో నమ్మకముంచిన ప్రజలను మోసం చేసి... రూ. 60 కోట్లు కొట్టేసిన దొంగలదా?" అంటూ అర్థవంతమైన ట్వీట్లతో ఆకట్టుకున్నాడు వర్మ. మొత్తానికి హర్రర్ సినిమాల పిచ్చి ఉండే వర్మ క్లైమాక్స్ అమ్మ ఆత్మ అంటూ కామెడీ చేయడు కదా అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sasikala Movie  RGV  Climax  Horror  Amma Jayalalithaa Ghost  

Other Articles