కాటమరాయుడు ఆడియో పంక్షన్ ఎందుకు లేదంటే... | Why Katamarayudu Audio Function Skip.

Katamarayudu follows mega family trend

Katamarayudu Pre Release Event, Katamarayudu Audio Function, Katamarayudu Audio, Katamarayudu Mega Trend, Katamarayudu Dates, katamarayudu Shocking Decision, Katamarayudu Pre Release Event

No Audio Function for Pawan kalyan Katamarayudu. Songs will be directly release in market and Producers think about pre release function.

పవన్ కాటమరాయుడు నో ఆడియో.. ప్రీ రిలీజ్ ఫంక్షన్??

Posted: 02/21/2017 12:49 PM IST
Katamarayudu follows mega family trend

ఒకప్పుడు స్టార్ల ఆడియో పంక్షన్లను గ్రాండ్ గా నిర్వహించి, పాటతో హైప్ క్రియేట్ చేసి ఆపై సినిమాతో ఫలితం రాబట్టుకునేవారు. అయితే గతేడాది నుంచి టాలీవుడ్ లో ఆ సాంప్రదాయం మారిపోయింది. నేరుగా పాటలను మార్కెట్ లోకి రిలీజ్ చేసేసి ఆపై ప్రీ రిలీజ్ పంక్షన్ల పేరిట కోలాహలం చేయటం జరుగుతోంది. టాప్ ప్రోడ్యూసర్ అల్లు అరవింద్ తన తనయుడు అల్లు అర్జున్ నటించిన సరైనోడుతో ఈ కల్చర్ పరిచయం చేయగా, మెగా హీరోలతోపాటు మరికొందరు చిన్న హీరోలు కూడా ఇప్పుడు దాన్నే ఫాలో అయిపోతూ వస్తున్నారు.

సరైనోడు తర్వాత రామ్ చరణ్ 'ధృవ', చిరంజీవి 'ఖైదీ నంబర్ 150', తాజాగా సాయి ధరమ్ తేజ్ 'విన్నర్' సినిమాలకు ఆడియో ఫంక్షన్ నిర్వహించలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లు నిర్వహిస్తూ ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేశారు. ఇప్పుడు తాజాగా అభిమానులకు కొత్త డౌట్ వస్తోంది. పవన్ కల్యాణ్ నటించిన 'కాటమరాయుడు' సినిమాకు కూడా ఆడియో ఫంక్షన్ నిర్వహించకుండా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తారా? అనేదే ఆ డౌట్. సమయం ఎక్కువగా లేకపోవటంతో పాటలను డైరెక్ట్ గా విడుదల చేసి, ఆ తర్వాత గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలనే యోచనలో చిత్ర యూనిట్ కూడా ఉన్నట్టు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

30 సెకన్ల టీజర్ తో మొత్తం సినిమాని లైమ్ లైట్ లోకి తెచ్చేశాడు పవర్ స్టార్. పెద్దగా హోప్స్ లేని మూవీ అనుకుంటే.. ఇప్పుడు 100 కోట్ల బిజినెస్ చేసే సినిమాగా కాటమరాయుడు అవతరించేసింది. కాటమరాయుడు రిలీజ్ కు సరిగ్గా ఓ వారం ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తారని తెలుస్తోంది. అలాగే ముందునుంచే ప్లాన్ చేసుకుని.. ఒక్కో పాటను డైరెక్టుగా రిలీజ్ చేసేయనున్నారట. జనాల్లోకి ఆడియో వెళ్లి కిక్ ఇచ్చేందుకు.. ఈ ఫార్మాట్ బాగా ఉపయోగపడుతోందని యోచిస్తున్నారంట. పవన్ కూడా తన ఫ్యామిలీ హీరోల ట్రెండ్ ఫాలో కానున్నాడని అంటున్నారు. చూద్దాం. టాకీ పార్ట్ పూర్తి కావటంతో ప్రస్తుతం పాటల షూటింగ్ చకచకా జరిగిపోతున్నాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Katamarayudu  No Audio  Pre Release Event  

Other Articles