కఠోర శ్రమ మరియు అదృష్టం.. హీరోయిన్ గా ఎదగాలంటే ఈ రెండు అంశాలు మాత్రమే కాదు.. మరో ముఖ్యమైంది కూడా అవసరమే. అదే తమ వ్యవరాలను మేనేజ్ చేసుకోవటం... రకుల్ , లావణ్య త్రిపాఠి లాంటి నార్త్ బ్యూటీలే కాదు, సమంత, రెజీనా లాంటి సౌత్ క్వీన్ లు కూడా టాప్ హీరోయిన్లుగా ఏలుతున్నారంటే అందుకు కారణం వారి టాలెంట్ అని ఒప్పుకోని తీరాలి. అదే సమయంలో వారి ప్రోఫెషనల్ జీవితం ఏ కష్టాలు లేకుండా సజావుగా సాగిపోయేందుకు మేనేజర్లు అనే అదృశ్య శక్తి సహకారం కూడా ఉంటుంది.
ఒకప్పుడు హీరోయిన్లు మేనేజర్లు అంటే చాలా దూరం ఉండేవారు. వారి కాల్షీట్ల వ్యవహారం తప్ప పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకునే వారు కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. అందుకే వారిని కూడా కుటుంబ సభ్యులుగా భావించే హీరోయిన్లు సముచిత స్థానం కల్పిస్తున్నారు.
మహేంద్ర బాబు నటి సమంత మేనేజర్. ఇండస్ట్రీకి 8 ఏళ్లు అవుతున్నప్పటికీ, గత ఐదేళ్లుగా ఆమె వ్యవహారాలను ఈయన్నే దగ్గరుండి చూస్తుంటున్నాడు. సమంత నా కూతురు లాంటిది. స్టోరీ నారేషన్ సమయంలో తప్ప మిగతా విషయంలో సంబంధంలేనట్లు ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను కూడా తననే చూస్కోమని చెబుతుంటుంది. తన మూడ్ ఎలా ఉన్నా సరే నాతో మాత్రం చాలా కూల్ గా ఉంటుంది. ఫర్ సపోజ్ నాపై కోపంగా వచ్చిందనుకోండి వెంటనే ఒకటి నుంచి 10 దాకా అంకెలు లెక్కించి వెంటనే నార్మల్ అయిపోతుంది అని మహేంద్ర చెబుతున్నాడు.
రెజీనా కస్సాండ్రా మేనేజర్ గా ఐవీ ప్రసాద్ వ్యవహారిస్తున్నాడు. నిజానికి వీరిద్దరి మధ్య చాలా కాలం నుంచే స్నేహం ఉంది. అయితే ఏడాది నుంచి మాత్రమే ఆయన మేనేజర్ గా వ్యవహారిస్తున్నాడు. ఇండస్ట్రీలోనే వరస్ట్ మేనేజర్ అంటూ జోక్ చేసిన రెజీనా అతను కేవలం మేనేజర్ మాత్రమే కాదని, అతనే తన కుటుంబమని పేర్కొంది. సినిమా విషయంలో ఇతర మేకర్లతో క్లాష్ కాకుండా చూసుకోవటమే కాదు, తాను అనారోగ్యానికి గురైన సందర్భంలో కూడా ప్రసాద్ చాలా సాయం చేశాడని గుర్తుచేసుకుంటోంది. తొలుత నిర్మాతగా కెరీర్ ప్రారంభించిన ఐవీ ప్రసాద్ చాలా నష్టాన్ని చవిచూశాడు. ఆ తర్వాతే మేనేజర్ గా మారిపోయిన అతగాడు ఇప్పుడు రెజీనా దయవల్ల తన ఆర్థిక పరిస్థితి బాగుందని సరదాగా చెప్పుకొచ్చాడు.
ఇప్పుడున్న వాళ్లలో రకుల్ ప్రీత్ సింగ్ టాప్ హీరోయిన్ అని ఒప్పుకుని తీరాల్సిందే. అయితే కెరీర్ తొలినాళ్లలో ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలో తెలీక చాలా అవస్థలు పడ్డానని, ఆ సమయంలోనే మేనేజర్ హరినాథ్ తన లైఫ్ లోకి దేవుడిలా ప్రవేశించాడని చెబుతోంది ఈ ఢిల్లీ బ్యూటీ. 2013 నుంచి రకుల్ కు హరినాథ్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. నాపై ఆయనకు చాలా నమ్మకం, తనకున్న పరిచయాలతో ముందు కొన్ని సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు. అదే ఇప్పుడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిందని కృతజ్నతతో చెబుతోంది.
హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యే సమయంలో రకుల్ బాధ్యతలను ఆమె పేరెంట్స్ తన చేతిలో పెట్టారని తెలిపాడు హరినాథ్. రకుల్ తన చిన్న చెల్లిలంటూ చెప్పుకొచ్చిన హరినాథ్, ప్రోఫెషనల్ బంధం కాస్త ఫ్యామిలీ మెంబర్ గా చేసేసిందని చెబుతున్నాడు.
ఇక డెహ్రాడూన్ బ్యూటీ లావణ్య త్రిపాఠికి ముగ్గురు మేనేజర్లు. వారితో తన పర్సనల్ సమస్యలను కూడా చర్చించుకునేంత చనువు ఉందని చెబుతోంది. కెరీర్ మొదట్లో భాష చాలా ఇబ్బంది పెట్టేది. కానీ, వారంతా నాకు ఎంతో సహకారం అందించారు. నేను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా వారు వెంటనే స్పందిస్తారు. స్టాఫ్ తో మర్యాదగా వ్యవహరించే హీరోయిన్లు చాలా తక్కువగా ఉంటారని, ఆ లిస్ట్ లో లావణ్యకు ఫస్ట్ ఫ్లేస్ ఇవ్వాలని ఆమె మేనేజర్ సీతారాం చెబుతున్నాడు. డేట్లు అడ్ జస్ట్ కానీ, క్రమంలో ఓపెన్ గా చెప్పేసే లావణ్య ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే ఏదో ఒక రకంగా ఆ తేదీలను సర్దుబాటు చేసేదంట.
ఇలా ప్రస్తుతం టాప్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్న ఈ హీరోయిన్లు తన మేనేజర్లతో నెట్టుకొస్తున్నారన్న మాట. ఇక మరికొందరు హీరోయిన్లకు తమ కుటుంబ సభ్యులే మెంటర్ లుగా వ్యవహరించటం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more