కాటమరాయుడుకు ఆ 5 మెయిన్ పాయింట్లు | Five reasons to watch this Pawan Kalyan Katamarayudu.

Why pawan kalyan s next create this much hype

Pawan kalyan, Katamarayudu Movie, Pawan Kalyan Katamarayudu, Katamarayudu Veeram Comparism, Pawan kalyan Katamarayudu, Why Katamarayudu Create Hype, Katamarayudu Buzz

Pawan Kalyan Katamarayudu Release Tomarrow. Here is The Five reasons to watch this Movie.

కాటమరాయుడు ఎందుకోసమంటే...

Posted: 03/23/2017 04:03 PM IST
Why pawan kalyan s next create this much hype

ప్రపంచవ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సందడి చేసేందుకు కొద్ది గంటలే మిగిలి ఉంది. భారీ ప్రీ రిలీజ్ బిజినెస్, ఆకాశంలో ఉన్న అంచనాలు... వెరసి సినిమాను ఏ రేంజ్ లో నిలబెడతాయోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పేరుకు ఓ రీమేక్ సినిమా కోసం ఇంతలా హైప్ వచ్చిందంటే దానికి కేవలం ఒక్క పవర్ స్టార్ క్రేజ్ మాత్రమే. మరి కాటమరాయుడు పై అంతగా చూపిన ప్రభావాలేంటో ఇప్పుడు
చూద్దాం...

ప్రమోషనల్ స్ట్రాటజీ...

ఇది ఓ రీమేక్ అని ముందు రివీల్ చేయలేదు చిత్ర యూనిట్. మెల్లిగా ఒక్కో లుక్కును వదులుతూ హింట్ ఇస్తూ వచ్చింది. అప్పటిదాకా పరిస్థితి ఒకలాగా ఉంటే, టీజర్ రెస్పాన్స్ తో ఆ పరిస్థితి ఎవరికీ అందనంత పీక్స్ కు వెళ్లిపోయింది. ఈ క్రమంలో సినిమాపై బజ్ నెలకొన్న క్రమంలో ఎక్కడా తేడా రాలేదు. అనవసరమైన హంగులకు పోకుండా, అంతెందుకు ప్రమోషన్ కూడా లేకుండా సైలెంట్ గా తమ పని కానిచ్చేశారు నిర్మాతలు.

Katamarayudu First Look


వైరల్ టీజర్:
తెలుగులో కోటి టీజర్ దాటిన తొలి చిత్రం కాటమరాయుడే. అంతేకాదు అదే స్థాయిలో లైకులు కూడా సాధించిన సినిమాగా టాలీవుడ్ లో కొత్త రికార్డు సృష్టించింది కూడా. ఆలస్యం అయినా పవన్, తన అభిమానులకు ఎలాంటి ట్రీట్ అందించాలో సరిగ్గా అలాంటిదే అందించాడు. దానిని అలాగే కొనసాగిస్తూ మిర మిర మీసం కూడా పవన్ వ్యక్తిత్వానికి సూటబుల్ లిరిక్స్ ఫర్ ఫెక్ట్ గా సింక్ అవటం బాగా కలిసొచ్చింది.

 

 

 

పవన్ స్టైల్...

చాలా కాలం తర్వాత పవన్ స్టైలింగ్ గురించి అభిమానులు డిస్కష్ చేసుకునే తరుణం వచ్చింది. పంచె కట్టు, కోర మీసపు సరికొత్త స్టైలింగ్ లో పవన్ విపరీతంగా ఆకట్టుకున్నాడు. గ్రామీణ నేపథ్యంలోనే సబ్జెక్టు కావటం, అందుకు తగ్గట్లు పవన్ స్టైలింగ్ సినిమాకు అదనపు బలాలుగా నిలవనున్నాయన్నది స్పష్టం అవుతుంది.

Pawan Panche Kattu

డాలీతో కాంబో..
కిషోర్ కుమార్ పార్థసాని(డాలీ) డైరక్షన్ లో గోపాల గోపాలలో నటించాడు పవన్. అది కూడా ఓ బాలీవుడ్ హిట్ (ఓ మైగాడ్) కు రీమేక్. సినిమా అంత కమర్షియల్ సక్సెస్ కాకపోయినా పవన్ ను సరిగ్గా డీల్ చేయగలిగాడన్న టాక్ వినిపించింది. అంతేకాదు పవన్ ను దేవుడి అవతారంలో చూపించే సరికి అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. దీంతో ఆటోమేటిక్ గా వీరిద్దరి కాంబోపై ఎక్సయిట్ మెంట్ మొదలయ్యింది.

Goapal Effect on Katamarayudu


ఒరిజినల్ మూవీ ఎఫెక్ట్...
దీని మాతృక వీరమ్ తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్. రవితేజ దరువు సినిమా దర్శకుడు శివ ఓ సాదాసీదా కథతో రూపొందించాడు. అజిత్ స్టార్ డమ్, దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ మ్యాజిక్ కలగలిపి ఓ సాధారణ సినిమాకు వంద కోట్ల హిట్ గా అక్కడ నిలబెట్టాయి. తర్వాత వీరుడొక్కడే పేరుతో తెలుగులోనూ ఆ సినిమా డబ్ అయ్యింది. దీంతో కాటమరాయుడులో కొత్తేం ఉందని కొందరు పెదవి విరిచారు. అయితే పవర్ స్టార్ క్రేజ్ ముందు అవేం నిలబడటం లేదు.

Katamaratyudu Veeram Effect

 

ఇప్పటికే వీకెండ్ ఫుల్ షోలతో కాటమరాయుడు నిండిపోయిది. ఫస్ట్ డే రికార్డులను తుడిచిపెట్టేందుకు అంతా సిద్ధమైపోయింది. పవన్ ప్లేస్ లో మరో హీరో గనుక ఉండి ఉంటే ఈ సినిమాకు ఇంత హైప్ వచ్చి ఉండేది కాదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక అందుతున్న పలు రివ్యూలు పాజిటివ్ గా వస్తుండటంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Katamarayudu  Veeram Remake  

Other Articles