మహేష్ కి ఫ్యాన్స్ ఫీలింగ్ తో సంబంధం లేదా? | Mahesh Babu fans hurt with first look delay.

Mahesh request to fans for first look

Mahesh Babu, Mahesh Babu Fans, Mahesh Babu Requested, Mahesh Babu Murugadoss First Look, Mahesh Babu 23 Movie First Look, Mahesh Babu Twitter Request, Mahesh Babu First Look

Mahesh Babu Murugadoss Movie First look not released on Ugadi. Due to Fans disappointment superstar responded on twitter. Mahesh himself took to twitter to assure his fans that the first look will be unveiled very soon. He didn't reveal the exact date and requested fans to be a little patient. Mahesh also said that his team is working relentlessly to deliver the best output.

ఫ్యాన్స్ కి మహేష్ సీరియస్ రిక్వెస్ట్

Posted: 03/30/2017 01:20 PM IST
Mahesh request to fans for first look

సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి మాట తప్పటంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. మురగదాస్ కాంబోలో చేస్తున్న మూవీ ఫస్ట్ లుక్ ఉగాదికి రిలీజ్ చేయబోతున్నట్లు స్వయంగా ఓ ఈవెంట్ లో మహేషే ప్రకటించాడు. ఎప్పటికప్పుడు ఫస్ట్ లుక్, టైటిల్ విషయంలో నిరాశకు గురవుతూ వస్తున్న అభిమానులు ఆ మాటతో హ్యాపీగా ఫీలయ్యారు.

అయితే తనకేం పట్టనట్లుగా ఫేస్ బుక్ లో ఉగాది విషెస్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టాడు. మరోవైపు టీం తరపు నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. దీంతో సూపర్ స్టార్ కి ఫ్యాన్స్ ఫీలింగ్ తో పని లేదని, మరోసారి హ్యాండిచ్చాడంటూ కామెంట్లు పడ్డాయి. ఇక పరిస్థితి చేజారుతుందని గమనించిన మహేష్ ట్విట్టర్ లో రియాక్ట్ అయ్యాడు. చిత్ర యూనిట్ అంతా రాత్రింబవళు కష్టపడుతున్నామని, అభిమానులు కాస్త ఓపిక పట్టాలంటూ అందులో పేర్కొన్నాడు. అతి త్వరలోనే ఫస్ట్ లుక్ వచ్చేస్తుందని ట్వీట్ చేశాడు.

అయితే మూవీ రిలీజ్ కు ఇంకా మూడు నెలల టైం ఉండటంతో ఇప్పటి నుంచే హడావుడి మొదలుపెడితే తప్ప భారీ బిజినెస్ అయ్యే ఛాన్స్ లేదని సినీ ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు యాక్షన్ సీక్వెన్స్ కోసం వియత్నాం షూటింగ్ లో బిజీ ఉన్న చిత్ర యూనిట్ ఏప్రిల్ 2న ఇండియాకు తిరిగి రానుంది. లేట్ కి కారణాలేంటో తెలీయనప్పటికీ మొత్తానికి చిత్ర యూనిట్ నుంచే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేదాకా ఆగి తీరాల్సిందే. స్టైలిష్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఐబీ ఆఫీసర్ గా, రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Murugadoss  First Look  

Other Articles