ఛా.. ఛా... బన్నీ వేలు పెట్టడం నిజం కాదంట! | Bunny not reason for DJ Delay.

Allu arjun dj movie pushed to june

Allu Arjun, Duvvada Jagannadham, DJ Movie Relase, DJ Movie Postponed, Allu Arjun Cop Role, Allu Arjun DJ, Duvvada Jagannadham Movie, DJ Movie, Bunny DJ Delay, DJ Release Date, DJ Movie Teaser

Stylish star Allu Arjun Duvvada Jagannadham movie release postponed to June.

అల్లు అర్జున్ డీజే వాయిదా పక్కానా?

Posted: 03/30/2017 03:24 PM IST
Allu arjun dj movie pushed to june

అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ దువ్వాడ జగన్నాథమ్ జెట్ స్పీడ్ కు బ్రేక్ పడిందా? అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కావట్లేదా? హరీష్ స్క్రిప్ట్ లో బన్నీ వేలు పెట్డాడా? ఇదీ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారిన చర్చ. అయితే కారణం ఏదైనా మే లో మాత్రం డీజే రావటం మాత్రం సాధ్యం కాదని తేలిపోయింది.  టీజర్ కోసం క్లిక్ చేయండి

దుబాయ్ షెడ్యూల్ లో ఉండగా దిల్ రాజు భార్య చనిపోవటం, ఆ తర్వాత చిత్ర సినిమాటోగ్రఫర్ ఆయానక బోస్ కు పుత్ర సంతానం ఇలా తదితర కారణాలతో చిత్రం వాయిదా పడుతూనే వస్తోంది. అయితే మళ్లీ షూటింగ్ ప్రారంభించుకున్న చిత్రానికి బన్నీరూపంలోనే అవాంతరం ఎదురయ్యిందని గుసగుసలు వినిపించాయి. స్క్రిప్ట్ లో కొన్ని సీన్లు నచ్చని అర్జున్ వాటిని డెవలప్ చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ కు సూచించాడని ఓ టాక్ వినిపించింది. అయితే ఉత్తర కర్ణాటక షూటింగ్ సమయంలో సెట్స్ సమస్య తలెత్తటంతోనే ఆ ఆలస్యానికి కారణమైనట్లు ఇప్పుడు క్లారిటీ వచ్చింది. మొత్తానికి చిత్రం సమయానికి రిలీజ్ కావటంపై డౌట్లు క్రియేట్ చేశాయి.

అయితే దీనిని కన్ఫర్మ్ చేస్తూ ప్రొడక్షన్ హౌజ్ ఓ ప్రెస్ రిలీజ్ ను వదిలింది. అందులో కారణాలేవీ పేర్కొనపోయినప్పటికీ షూటింగ్ అప్ డేట్ విషయాలను తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే దినేశ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఓ పాటను షూట్ చేస్తున్నారంట. ఈ పాట సినిమాకే హైలెట్ అవుతుందని దర్శకుడు హరీష్ చెబుతున్నాడు. మరోవైపు బన్నీ అండర్ కవర్ కాప్ గా ఇందులో నటించబోతున్నాడంటూ మరో వార్త ఇప్పుడు వినిపిస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Duvvada Jagannadham  Release Postponed  

Other Articles