పూరీకి.. ఆ ఫిగర్ కి... ఏమైనా సంబంధం ఉందా? | Rogue collections not matching with Puri remuneration.

No collections for puri rogue

Rogue Movie, Rogue Movie Collections, Rogue DIsaster, Rogue Movie Puri Jagannadh, Rogue Movie Actress Affair, Puri Mannara, Puri Jagannadh Rogue Collections

Rogue movie collections dull at box office especially at overseas. The movie collected gross of mere 330 dollars in four days. Puri Jagannadh's brand name took a beating with this.

రోగ్ కలెక్షన్లు.. మరీ ఘోరంగా ఉన్నాయే!

Posted: 04/05/2017 01:49 PM IST
No collections for puri rogue

పస లేని కథలతో సినిమాలు తీస్తూ మా సహనానికి ఎందుకు పరీక్షలు పెడుతున్నాడంటూ స్టార్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ పై ప్రేక్షకులు మండిపడటం తెలిసిందే. కేవలం డబ్బు కోసమే సినిమాలు తీస్తున్నాడనే తప్ప, పెద్ద విషయమేం లేదని మరికొందరు కాస్త ఘాటుగానే చెప్పేస్తున్నారు. అందుకు కారణం రీసెంట్ గా వచ్చిన రోగ్ రిజల్టే.

ఇందుకు ఓ చిన్ని ఉదాహరణ చెప్పుకుందాం. కొంత కాలం క్రితం టాలీవుడ్ లో ఓ సినిమా వచ్చింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఆ చిత్రం ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. భారీ రేటుకు హక్కులు అమ్ముడు పోగా కేవలం 80 డాలర్లు మాత్రమే రాబట్టి బయ్యర్లకు కోలుకోలేని దెబ్బేసింది. ఇక ఇప్పుడు రోగ్ కూడా దాదాపు అదే పని చేసింది. వీకెండ్ లో ఈ చిత్రం రాబట్టింది కేవలం 330 డాలర్లు మాత్రమే.

ఒక్కో సినిమాకు దాదాపు 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే పూరీకి, ఆ కలెక్షన్ల ఫిగర్ కి ఏమైనా సంబంధం ఉందా? అఫ్ కోర్స్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పరిస్థితి ఇలాగే ఉందని చెప్పుకోవాలి. హీరోను చూసి కాకపోయినా కనీసం పూరీ పేరుతో అయినా మంచి బిజినెస్ జరుగుతుందని భావించారు. కానీ, డిజాస్టర్ అని కూడా వర్ణించటానికి వీలులేని విధంగా రోగ్ పరిస్థితి తయారయ్యిందంటే అతిశయోక్తి కాదు. మరి ఈ ఎఫెక్ట్ తోనైనా మారి బాలయ్య చిత్రంతో పూరీ బౌన్స్ బ్యాక్ అవుతాడా? చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Puri Jagannadh  Rogue Movie Collections  Disaster  

Other Articles