కేవలం రాజమౌళి మూలంగానే బాహుబలి ద్వారానే ఈ క్రేజ్ వచ్చిందని, లేకుంటే ప్రభాస్ కు అంత సీన్ లేదంటూ కొంత మంది యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పని గట్టుకుని మరీ ట్రోల్ చేయటం చూశాం. అయితే తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి కూడా దేశం మొత్తం చర్చించుకోవటం చూస్తుంటే ఆ వాదన సరైంది కాదన్నది తేలిపోయింది. ఇక మిగిలింది చిత్ర రెగ్యులర్ షూటింగ్ లో డార్లింగ్ ఎప్పుడు జాయిన్ అవుతాడో అని ఎదురుచూడటమే.
ఇదిలా ఉంటే కొంత కాలంగా ఈ చిత్ర టీజర్ ను బాహుబలి ది కంక్లూజన్ తో ప్రదర్శిస్తారనే చెప్పుకుంటూ వస్తున్నాం. దాదాపు 4 ఏళ్ల పాటు స్టైలిష్ ప్రభాస్ దూరం కావటంతో మళ్లీ ఎలా ఉంటాడోనని ఆసక్తి కూడా క్రియేట్ అవుతోంది. అందుకే ఆ అంచనాలను అందుకునే విధంగా నిమిషంన్నర సెకన్ల టీజర్ రూపకల్పన చేసే పనిలో సుజిత్ బిజీగా ఉన్నాడంట. కానీ, ఇందులో 40 సెకన్లు కేవలం ఎఫెక్ట్సే చూపించబోతున్నారంట. ఆ లెక్కన ప్రభాస్ కనిపించేది కేవలం 50 సెకన్లు మాత్రమే.
ప్రస్తుతం ఓ సీక్రెట్ లోకేషన్ లో షూటింగ్ జరుపుకుంటున్న టీజర్ లో జస్ట్ ప్రభాస్ మాత్రమే కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక చిత్రం కోసం బాలీవుడ్ హీరోయిన్, మరికొందరు తారాగణం ను తీసుకోబోతున్నారనే చెప్పుకుంటున్నారు. మొత్తానికి బాహుబలి తోనే కొత్త సినిమా టీజర్ రాబోతుందన్న వార్త కన్ఫర్మ్ మాత్రం అయ్యింది. ఆ లెక్కన బాహుబలి-2, కొత్త సినిమా టీజర్ తో డబుల్ ట్రీట్ అందించబోతున్నాడన్న మాట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more