యామీ ఓవర్ యాక్షన్.. హృతిక్ కు ఎక్కడో కాలిపోయింది. ఏం చేసిందంటే... | Yami irritate Hrithik with her attitude.

Hrithik loses his cool after yami gautam keeps him waiting

Hrithik Roshan, Yami Gautam, Yami Gautam Irritate, Kaabil Success meet, Hrithik Roshan Angry Yami Gautam, Yami Gautam Hritik, Hrithik Roshan Yami Delay, Yami Gautam Fire, Yami Gautam Disappoint Fans

Hrithik Roshan Loses His Temper After Co-Star Yami Gautam Makes Him Wait At Kaabil success fans interaction event.

యామీ లేట్.. హృతిక్ ఫైర్

Posted: 04/13/2017 03:23 PM IST
Hrithik loses his cool after yami gautam keeps him waiting

స్టార్ హీరోయిన్లు షూటింగ్ లకు, ప్రైవేట్ ఫంక్షలను, ప్రమోషన్లు ఎగ్గొట్టడం లేట్ చేయటం లాంటివి జరిగినప్పుడు కష్టమో, నష్టమో మేకర్లు కాస్త ఓర్చుకునే పరిస్థితులు ఎదురవుతుంటాయి. కానీ, హీరోలకు మాత్రం చిరాకు, అసహనం ఓపెన్ గానే వ్యక్తం చేస్తూ ఫైర్ అవుతుంటారు. బాలీవుడ్ లో ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామీ గౌతమ్ వ్యవహార శైలి కూడా కండల వీరుడు హృతిక్ రోషన్ కి కాలేలా చేసింది.

విషయం ఏంటంటే.. కాబిల్ రిలీజ్ టైంలో ఓ కాంటేస్ట్ నిర్వహించిన చిత్ర నిర్మాతలు వంద మందిని ఎంపిక చేసి వారితో హీరో-హీరోయిన్లకు ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం జుహులోని ఓ హోటల్ లో దీనిని నిర్వహించారు.సాయంత్రం ఆరు గంటలకు కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా హృతిక్ తోపాటు చిత్ర నిర్మాత రాకేష్ రోషన్ కు కూడా టైంకి వేదికకు చేరుకున్నారు. అయితే హీరోయిన్ గా చేసిన యామీ మాత్రం ఆలస్యంగా కార్యక్రమానికి వచ్చింది. పైగా ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవటం హృతిక్ కు మరింత ఆగ్రహాం తెప్పించింది.

అయితే అభిమానులను నిరాశపరచటం ఇష్టం లేని హృతిక్ పైకి నవ్వుతూనే కార్యక్రమం పూర్తిచేశాడు.ఇక చివర్లో అక్కడికి వచ్చిన యామీ కనీసం వేదిక లోపలికి కూడా వెళ్లకుండా బయటే కెమెరాలకు ఫోజులిచ్చి అటు నుంచి అటే చెక్కేసింది. టైం పంక్చువాలిటీ మాట అటుంచి తనను కాకపోయినా కనీసం లోపలికి అభిమానులను పలకరించకుండా వెళ్లిపోయిన యామీపై గుస్సాతో ఉన్నాడంట. యాడ్ లు, చిన్న చిన్న సినిమాలు తీసుకొచ్చి తన పక్కన యాక్ట్ చేయించి మంచి పేరు తెప్పించిన తనపట్ల ఇలా బిహేవ్ చేయటంతో హృతిక్ కు కోపం రావటం కరెక్ట్ కాదంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yami Gautam  Hritik Roshan  Kaabil Success meet  

Other Articles