రాబ్తా ట్రైలర్ టాక్: రియల్ లవర్స్ ఎంతగా రెచ్చిపోయారంటే... | Sushant - Kriti electrifying chemistry in Raabta Trailer.

Raabta movie trailer out

Raabta Movie, Raabta Trailer, Raabta Trailer Review, Raabta Trailer Talk, Raabta Movie, Raabta Story, Raabta Actress, Raabta Hero, Raabta Pair, Raabta Hot Scenes, Raabta Hot Scenes, Raabta Intimate Scenes, Raabta All Kisses, Sushant Singh Rajput Raabta Trailer, Kriti Sanon Raabta

Raabta Movie trailer released. Sushant Singh Rajput and Kriti Sanon's chemistry is a visual treat in this modern reincarnation story.

రాబ్తా అఫీషియల్ ట్రైలర్ విడుదల

Posted: 04/17/2017 04:26 PM IST
Raabta movie trailer out

మన దగ్గర మగథీర వచ్చాక పునర్జన్మ నేపథ్యం ఉన్న కథలు ఈ మధ్య బాలీవుడ్ లోనూ వస్తూ ఉన్నాయి. అనిల్ కపూర్ కొడుకు, సయామీ ఖేర్ జంటగా రాకేశ్ ఓంప్రకాశ్ తీసిన మీర్జాయ‌ కూడా ఈ బాపతే. అయితే గతేడాది వచ్చిన ఆ చిత్రం ఘోరంగా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సేమ్ కంటెంట్ తో మరో చిత్రం రాబోతుంది అదే రాబ్తా.

ధోనీ ఫేం సుశాంత్ సింగ్ రాజ్ పుత్, మహేష్ బాబు వన్ చిత్ర హీరోయిన్ కృతి సనన్ జంటగా ఈ చిత్రం రూపొందించాడు దర్శకుడు దినేశ్ విజన్. ఈ చిత్ర ట్రైలర్ ఈ రోజే విడుదల అయ్యింది. మరి అదెలా ఉందో చూద్దాం. ఓపెన్ చేస్తే సుషాంత్ రాజ్ పుత్, కృతి సనన్ లు ఓ యువ ప్రేమ జంటగా ఉంటారు. అయితే వాళ్ల మధ్యలోకి ఓ వ్యక్తి వచ్చి కృతిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. కృతి కూడా అతనికి ఆల్ మోస్ట్ లొంగిపోయే క్రమంలో వాళ్ల ఫ్లాష్ బ్యాక్ బయటపడుతుంది.

 

కొన్నేళ్ల క్రితం ఓ తెగకు సంబంధించిన ఈ ముగ్గురి మధ్య ట్రై యాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. ఆ ప్రయత్నంలో వారి ప్రాణాలు కోల్పోతారు. తిరిగిన జన్మించిన ఆ అమ్మాయిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని విలన్ యత్నిస్తుంటాడు. అతనిని నుంచి హీరో ఆమెను ఎలా కాపాడతాడు? తన ప్రేమను ఎలా దక్కించుకుంటాడు అన్నదే కథ. సుషాంత్ చాలా స్టైలిష్ అండ్ కూల్ అవతారంలో కనిపిస్తుండగా, ఇక లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్లలో కృతి చెలరేగిపోయింది. కృతి కోసం రగిలిపోయే పాత్రలో విలన్ గా జిమ్ సర్బ్ నటించాడు. ఆదిమవాస తెగల గెటప్ లు కాస్త తేడాగా ఉన్నప్పటికీ విజువల్ గా మాత్రం గ్రాఫిక్స్ హంగులు భారీగానే ఉన్నట్లు అనిపిస్తోంది. జూన్ 9 న రాబ్తా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raabta Movie  Trailer Released  Kriti Sanon  Sushant Singh Rajput  

Other Articles