కళకు కుల, మత, భాష తారతమ్యాలు ఉండవంటూ కొందరు నటులు పలు సందర్భాలలో చెప్పటం చూశాం. ఉరి దాడి తర్వాత పాకిస్థాన్ నటులను బ్యాన్ చేయాలంటూ ఓ రాజకీయ పార్టీ చేసిన రణరంగం గుర్తుండే ఉంటుంది. అయితే మతాల పేరుతో కొట్టుకు చస్తున్న మనుషులకు తనదైన రీతిలో ఎమోషనల్ సందేశాన్ని ఇచ్చాడు నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.
డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నానని, అందులో ఏం తేలిందంటే అన్న ప్లకార్డుతో ఈ వీడియో మొదలవుతుంది. తాను తాను 16.66 శాతం హిందువుని అన్న ప్లకార్డు పట్టుకొని పక్కా హిందువు రూపంలో అతను కనిపిస్తాడు. ఆ తర్వాత 16.66 శాతం ముస్లింనని ముస్లిం రూపంలో.. ఇలా ప్రతి మతం ప్లకార్డుతోపాటు అదే వేషధారణలో కనిపిస్తాడు నవాజ్. చివర్లో తాను 100 శాతం ఆర్టిస్ట్నన్న ప్లకార్డుతో వీడియో ముగుస్తుంది.
ఒక్క మాట కూడా లేని ఈ వీడియోలో ప్లకార్డుల సాయంతోనే తను అనుకుంటున్నది స్పష్టంగా వివరించే ప్రయత్నం చేశాడు. మత ఛాందస్సులకు చెంప పెట్టులా ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ అయింది. అతని అభిమానులనే కాదు.. నెటిజన్లందరినీ ఆకట్టుకుంటున్నది. ప్రస్తుతం శ్రీదేవీ మామ్ తోపాటు మరో మూడు చిత్రాల్లో ఈ విలక్షణ నటుడు నటిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more