Balakrishna Puri Movie Title Reveal on NTR's Birthday

Balayya 101 title in dilemma

Balayya 101, NBK101, Balakrishna Puri Movie Title, NTR Birthday Balakrishna, Ustad or Gangster, Balakrishna Shriya Saran Third Movie, Nandamuri Balakrishna 101

Nandamuri Balakrishna 101 Movie Title Launches on May 28 NTR's Birthday Occasion. Ustad or Gangster Title Consider.

బాలయ్య 101 .. ఉస్తాద్ లేదా గ్యాంగ్ స్టర్?

Posted: 05/10/2017 02:20 PM IST
Balayya 101 title in dilemma

శత చిత్రాల యోధుడు నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రెండు షెడ్యూలు పూర్తి చేసిన పూరీ పోర్చుగల్ లో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. భారీ యాక్షన్ డూప్ ల సాయం లేకుండానే చేయాలని బాలయ్య డిసైడ్ అయ్యాడు. అంతేకాదు ఛేజింగ్ ల కోసం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అఫ్లై చేయటం విశేషం.

ఇక సినిమాలో బాలయ్య ఓ ఏజ్డ్ గ్యాంగ్ స్టర్ రోల్ చేయబోతున్నాడన్నది తెలిసిందే. డిఫరెంట్ మ్యానరిజంతో నందమూరి ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా పక్కా కమర్షియల్ హంగులు ఉండబోతున్నాయని పూరీ ఇప్పటికే ప్రకటించాడు. ఇక ఈ చిత్ర టైటిల్ విషయంలో ఇప్పుడు కాస్త సస్పెన్స్ నెలకొంది. ఇంతకు ముందు టపోరి అంటూ ఓ టైటిల్ వినిపించినప్పటికీ ఇప్పుడు గ్యాంగ్ స్టర్ లేదా ఉస్తాద్ అన్న టైటిళ్లలో ఏదో ఒకదాన్ని ఖరారు చేయబోతున్నారు.

మే 28న స్వర్గీయ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ ఫస్ట్ లుక్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. భవ్య క్రియేషన్స్ పై చిత్రీకరిస్తున్న ఈ చిత్రంలో శ్రీయా హీరోయిన్ గా నటిస్తోందని టాక్. దసరాకు 101వ చిత్రం రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Balakrishna  101 Movie  Gangster or Ustad  

Other Articles