Pawan Kalyan in Telugu remake of Jolly LLB 2

Pawan kalyan in jolly llb 2 remake

Pawan Kalyan, Akshay Kumar Pawan kalyan, Pawan kalyan Jolly LLB 2, Jolly LLB 2 Telugu Remake, Jolly LLB 2 Pawan kalyan, Pawan Kalyan Bollywood Hit Remake, Pawan In Akshay Role Again, Pawan Akshay Kumar, Pawan Bollywood Remake, Pawan Hindi Remake, Jolly LLB 2 Pawan, Pawan Kalyan Another Remake, Not Venkatesh Its Pawan Kalyan, No Venkatesh Pawan Kalyan

Akshay Kumar's Jolly LLB 2 to be remade in Telugu. Pawan Kalyan in Lead and not full details disclose.

జాలీ ఎల్ ఎల్ బీ రీమేక్ లో పవన్

Posted: 05/13/2017 04:33 PM IST
Pawan kalyan in jolly llb 2 remake

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడా? ఈ యేడాది మొదట్లో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన జాలీ ఎల్ ఎల్ బీ పార్ట్ 2 ను దాదాపు ఖరారైందనే వార్త తెగ వైరల్ అవుతోంది.ఇంతకు ముందు ఈ సినిమా వెంకీతో తీయబోతున్నారని చెప్పుకున్నప్పటికీ ఆ వార్తను దగ్గుబాటి కాంపౌండ్ అఫీషియల్ గానే కొట్టిపడేసింది. దీంతో ఇప్పుడు పవన్ చేయబోతున్నాడని చెప్పుకుంటున్నారు.

త్రివిక్రమ్ దగ్గరి బ్యానర్ అయిన హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్ర హక్కులను కోటి 75 లక్షలకు సొంతం చేసుకుందని సమాచారం. జాలీ ఎల్ ఎల్ బీ 2 న్యాయ వ్యవస్థ పై సెటైరిక్ గా రూపొందిన చిత్రం. అక్కీ యాక్టింగ్ విమర్శకుల ప్రశంసలు అందుకోగా, వంద కోట్ల కలెక్షన్ల సాధించింది కూడా.  

త్రివిక్రమ్ తో కలిసి సినిమాను వీక్షించిన పవన్ ఈ మేరకు రీమేక్ లో నటించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించాడంట. అయితే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాతో బిజీ అయిపోతుండటంతో కేవలం మాటలు మాత్రమే అందించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు వర్షన్ కి తగ్గట్లు త్రివిక్రమే దగ్గరుండి మార్పులు చేయబోతున్నాడని కూడా చెబుతున్నారు. మరి దర్శకుడు ఎవరన్న దానిపై మరికొన్ని రోజుల్లో స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Jolly LLB 2 Remake  Akshay Kumar  

Other Articles