Nithya Menon confirms U Turn Telugu Remake

Talented actress for u turn remake

Nithya Menon, Nithya Menon U Turn, Samantha Nithya Menen, Nithya Menen Replaces Samantha, Samantha U Turn Nithya Menon, Nithya Menon 2017 Telugu Movies, Nithya Menon Movies, Kannada Hit Remake Nithya Menon

Nithya Menon replaces Samantha in the Telugu remake of 'U Turn'.

సమంత ప్లేస్ లో నిత్యామీనన్.. యూటర్న్ రీమేక్ కన్ఫర్మ్

Posted: 05/13/2017 05:46 PM IST
Talented actress for u turn remake

తెలుగమ్మాయి కాకపోయినా తానేం తక్కువ కాదంటూ మొదటి సినిమాకే డబ్బింగ్, ఓ పాట పాడేసింది నిత్యామీనన్. వేరే భాషల నుంచి దిగుమతి అయిన భామల్లో తెలుగు త్వరగా నేర్చేసుకుంది బహుశా ఈ మల్లూ బ్యూటీనే కాబోలు. అయితే ఇన్నాళ్ల కెరీర్ లో చాలా సెలక్టివ్ ప్రాజెక్టులు చేసి అంతే క్రేజ్ ను సంపాదించేసుకుంది.

కానీ, జనతా గ్యారేజ్ తర్వాత స్ట్రెయిట్ తెలుగు మూవీ ఓకే చేసింది లేదు. ఆ మధ్య డైరక్టర్ ఆలోచనలతోనే సావిత్రి బయోపిక్ ను వదిలేసుకుందని కూడా చెప్పుకున్నాం. కానీ, ఇప్పుడు రియలైజేషన్ అయ్యిందో ఏమో తెలీదుగానీ వరుసగా సినిమాలతో ఎగబడిపోయేందుకు సిద్ధమైంది. అందులో ఒకటి కేఎస్ రామారావు బ్యానర్ క్రియేట్ కమర్షియల్ లో ఓ కొత్త కుర్రాడి దర్శకత్వంలో సినిమా.

ఇంకోకటి కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన యూటర్న్ తెలుగు రీమేక్. నిజానికి ఈ సినిమా కోసం స్పెషల్ గా బెంగళూర్ వెళ్లి మరీ షో చూసి వచ్చిన సమంత ఆ సినిమాను రీమేక్ చేయాలనుకుంది. అవసరమైతే తానే నిర్మాతగా రూపొందించాలన్న ఫ్లాన్ కూడా చేసింది. కానీ, ఇంతలో నిత్యాతో ఆ సినిమా ఖరారైనట్లు తెలుస్తోంది. ఆల్ మోస్ట్ కన్ఫర్మ్ అయిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithya Menon  U Turn Movie  Telugu Remake  

Other Articles