Sangamithra real competition for Baahubali

Sangamithra to become next baahubali of india

Sangamithra, Sangamithra Movie, Sangamithra 2017, Sangamithra Baahubali, Sangamithra greater than Baahubali, Sangamithra Hype, Sangamithra Fantasy Movie, Sangamithra Compare Baahubali

Sangamithra Movie First Look Posters released at Canes Film Festival. Kollywood compared more than with Baahubali now.

బాహుబలికి పోటీగానే సంఘమిత్రనా?

Posted: 05/19/2017 02:39 PM IST
Sangamithra to become next baahubali of india

ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ బిగ్ బడ్జెట్ మూవీలకు తక్కువేం కాదని నిరూపించే సమయం వచ్చేసింది. బాహుబలి ప్రేరణతో వరుసగా భారీ బడ్జెట్ సినిమాల పై పెట్టుబడులు పెట్టేందుకు సౌత్ ఇండస్ట్రీ నుంచి చాలా మందే ముందుకు వచ్చారు. మహాభారతం, రామాయణం, శివాజీ బయోపిక్ ఇలా చాలానే అందులో ఉన్నాయి. అయితే బాహుబలి ఫస్ట్ పార్ట్ టైంలోనే ఓ ప్రాజెక్టుకు రూపకల్పన పడటం ఇక్కడ విశేషం. అదే సుందర్ సి డైరక్షన్ లో సంఘమిత్ర.

ఆర్య, జయం రవి, శృతీహాసన్ లీడ్ రోల్స్ లో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో సంఘమిత్ర తెరకెక్కుతోంది. ఇందుకోసం ఇప్పటికే లీడ్ రోల్స్ మొత్తం కఠోర శిక్షణ తీసుకునే పనిలో నిమగ్న మయ్యారు కూడా. అయితే ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానీ ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ లు రిలీజ్ చేయటం, అవి కాస్త హాట్ టాపిక్ గా మారటం జరిగిపోయాయి. శృతీహాసన్ గుర్రం మీద ఉన్న ఫోజు, నావలో హీరో ఆర్య నిల్చున్న పోస్టర్లను కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా వదిలింది.

అయితే ఇప్పటిదాకా బాగానే ఉన్నప్పటికీ బాహుబలి కంటే బెటర్ ఎపిక్ తీయబోతున్నామంటూ కోలీవుడ్ మీడియా కథనాలు కూడా రాసేసింది. ఫస్ట్ లుక్కులతో కామిక్ ఇంప్రెషన్ దక్కించుకున్న సంఘమిత్ర బాహుబలితో కంపేరిజన్ చేసుకోవటమే కామెడీగా ఉంది.8వ శతాబ్ధంలో తన రాజ్యాన్ని కాపాడుకునేందుకు సంఘమిత్ర అనే యువరాణి చేసిన సాహస క్రీడలతో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sangamithra  Kollywood Movie  Baahubali  

Other Articles