Happy 75th Birthday K Raghavendra Rao

Raghavendra rao birthday special

Raghavendra Rao, Raghavendra Rao Birthday Special, Raghavendra Rao Happy Birthday, Raghavendra Rao 75 Years, Raghavendra Rao 75th Birthday, Raghavendra Rao Special, Raghavendra Rao Special Story, Raghavendra Rao, K Raghavendra Rao Birthday

Happy birthday to k raghavendra rao. The Veteran Director celebrates his 75th Birthday. Remembering the iconoclast's best Cpmmercial films.

హ్యాపీ బర్త్ డే దర్శకేంద్ర కే రాఘవేంద్ర రావు

Posted: 05/23/2017 02:54 PM IST
Raghavendra rao birthday special

కే.రాఘవేంద్ర రావు సినీ కళామతల్లికి, తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ వెటరన్ దర్శకుడు ఇవాళ 75వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన గురించి... మే 23, 1942 లో ఓ వ్యవసాయం కుటుంబంలో జన్మించిన కొవెలమూడి రాఘవేంద్రరావు బాల్యంలో పెద్దగా చెప్పుకోదగిన విషయాలేవీ లేవు. బీఏ విద్య పూర్తయ్యాక సినిమా విభాగంలోకి అడుగుపెట్టిన ఆయన 1975 లో బాబు అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆపై తెలుగు సినిమాకు కమర్షియల్ సత్తా ఉందని చాటే ఎన్నో చిత్రాలను తెరకెక్కించాడు. మంచి కథ, దానికి తోడు స్టార్ల సహకారం ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్లను అందించాడు.

ఇక పూలు, పండ్లను ఈయనగారు ఉపయోగించినంతగా బహుశా ఎవరూ వాడి ఉండరేమో. హీరోయిన్లను ఎక్స్ పోజింగ్ గ్లామర్ మధ్య ఉంచుతూ చాలా అందంగా చూపించటంలో ఎవరూ సాటిరారు. భక్తిరస చిత్రాల్లో కూడా రొమాంటిక్ యాంగిల్ ను ఎలా ప్రజెంట్ చేయాలో ఈయనది అందె వేసిన చెయ్యి. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఇలా హీరోలు, జయప్రద, జయసుధ, విజయశాంతి, రమ్యకృష్ణ వీరంతా రాఘవేంద్రరావు వల్లే స్టార్ స్టేటస్ ను అందుకున్నారనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భక్తిరస చిత్రాలతో ఫేమస్ అయిన ఎన్టీఆర్ ను యుగపురుషుడు, వేటగాడు, అడవిరాముడు లాంటి చిత్రంలో పక్కా కమర్షియల్ హీరోగా మార్చిపడేశాడు.

తెలుగు హిందీ కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. జ్యోతి’’రాజా’ ,’ఆమె కథ’ వంటి లేడీ ఓరియంటల్ చిత్రాల తర్వాత ‘అడవి రాముడు’,’పదహారేళ్ళ వయసు’,’డ్రైవర్ రాముడు’,’వేటగాడు’,’జస్టీస్ చౌదరి’,’దేవత’,,’అగ్ని పర్వతం’,’ఘరానా మొగుడు’,’అల్లరి ప్రియుడు’,’అల్లరి మొగుడు’,’కూలి నెంబర్ 1′,’ఘరానా బుల్లోడు’,’మేజర్ చంద్రకాంత్’,’పెళ్లి సందడి’,’అన్నమయ్య’, ‘గంగోత్రి’, ‘శ్రీ రామదాసు’ ఇలా ఆయన ఖాతాలో ఎన్నో హిట్లు. దర్శకుడిగా 7 స్టేట్ నంది అవార్డులు, 4 ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు పలు ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్నారు.

హీరోల్లో ముఖ్యంగా నాగార్జునతో రాఘవేంద్ర రావుది ప్రత్యేక అనుబంధం. ఘరానా బుల్లోడు లాంటి మాస్ ఎలిమెంట్ చిత్రమే కాదు. అన్నమయ్య లాంటి ఆల్ టైం క్లాసిక్ భక్తిరస చిత్రాన్ని అందించిన ఘనత ఈయనది. జంధ్యాల, కే విశ్వనాథ్ లాంటి ఎందరో దర్శకులు తీయాలనుకున్న వాగ్గేయకారుడి జీవిత కథను అప్పటిదాకా రొమాంటిక్ ఇమేజ్ ఉన్న నాగ్ తో తీసి బ్లాక్ బస్టర్, 8 నంది అవార్డులను అందించాడు. ఈ మధ్యే ఓం నమో వేంకటేశాయ తర్వాత రిటైర్ మెంట్ ప్రకటించినప్పటికీ, తర్వాత మనసు మార్చుకుని సినిమాలు చేసేందుకు ముందుకు రావటం విశేషం. ఆయన ఇలాంటి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ తెలుగు విశేష్ ఆయనకు ప్లాటినం జూబ్లీ బర్త్ డే విషెష్ తెలియజేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Ace Director  Raghavendra Rao  75th Birthday  

Other Articles