ఇండియాలో ఇప్పటిదాకా తెరకెక్కిన హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాల సంగతి ఏమోగానీ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మహాభారతం మాత్రం అక్షరాల 600 కోట్ల పై చిలుకు బడ్జెట్ తోనే తీయబోతున్నారన్నది మాత్రం పచ్చి నిజం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు, కాస్టింగ్ ఎంపికలో బిజీగా ఉన్న మేకర్లు ఈ యేడాది చివర్లోనే షూటింగ్ ప్రారంభించాలని డిసైడ్ అయిపోయారు.
ఇదిలా ఉంటే రంధమూజం(రంధమూలం) అనే నవల భీముడి ని హైలెట్ చేస్తూ నడుస్తుంది. అయినప్పటికీ భారతంలోని ఫ్లేవర్ ఎక్కడా మిస్ కాకుండా చూస్తానని దర్శకుడు శ్రీకుమార్ మీనన్ చెబుతున్నాడు. ఇప్పటిదాకా కేవలం మోహన్ లాల్ రోల్ భీముడిగా కన్ఫర్మ్ కాగా, ఇప్పుడు మరో రోల్ కి నాగ్ ను సంప్రదించారనే విషయంలో స్పష్టత వచ్చింది. రారండోయ్ వేడుక చూద్దాం ప్రమోషన్ లో భాగంగా తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి చెప్పుకొచ్చిన నాగ్ మహాభాతరం సినిమా గురించి కూడా ప్రస్తావించాడు.
సినిమాలో కర్ణుడి రోల్ కోసం తనని సంప్రదించారని, దానికి తాను అంగీకారం తెలిపానని, స్క్రిప్ట్ పనులయ్యాక మళ్లీ కలవమని చెప్పాని చెప్పాడు. ఇక ఈ సినిమా ఆలోచన ఇప్పటిది కాదని, నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని వివరించాడు. మిగతా రోల్స్ లో ఎవరిని తీసుకున్నారన్న దానిపై తనకు కూడా క్లారిటీ లేదని అమీర్ కృష్ణుడి రోల్ ప్రశ్నకు సమాధానమిచ్చాడు నాగ్. అయితే ఏ చిన్న రోల్ అయినా ఫర్వాలేదని నాగ్ చెప్పటంతో కర్ణుడికి బెటర్ ఛాయిస్ దొరికితే క్యారెక్టర్ మారే అవకాశం లేకపోలేదు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more