DJ face tough fight with Nani Ninnu Kori at US box office

Nani versus bunny us box office

Allu Arjun DJ, Nani Ninnu Kori Movie, Ninnu Kori Adiga Teaser, Adiga Adiga Song, Ninnu Kori Songs, DJ Movie Songs, Bunny Nani Fight, Nani Bunny US Box Office

Nani’s Hat-Trick combo Ninnu Kori Come In DJ Way at US Box Office, he Teaser already impressive got good response.

బన్నీ వర్సెస్ నాని @యూఎస్ బాక్సాఫీస్

Posted: 05/25/2017 11:57 AM IST
Nani versus bunny us box office

వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథమ్ తో మరో హిట్ కు రెడీ అయితున్నాడనే సంకేతాలు టీజర్ అండ్ టైటిల్ సాంగ్ లు అందించాయి. అయితే అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఒక్క మెతుకు ముట్టుకుని చూస్తే చాలు అన్న థియరీని అనుసరించి ఇక్కడ మరో సినిమా బన్నీకి అడ్డుతగిలే అవకాశాలు బోలెడు కనిపిస్తున్నాయి. అదే నేచురల్ స్టార్ నాని నిన్ను కోరి.

నిన్ను కోరి అడిగా అడిగా సాంగ్ టీజర్ తాజాగా రిలీజ్ అయి దూసుకుపోతున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరక్టర్ గోపీసుందర్ అందించిన మెలోడీయస్ ట్యూన్ బాగా ఆకట్టుకుంటోంది. గతంలో వీరిద్దరి కాంబోలో భలే భలే మగాడివోయ్ పెద్ద బ్లాక్ బస్టర్ కాగా, మజ్ను యావరేజ్ అయినప్పటికీ పాటల పరంగా సెన్సేషనే క్రియేట్ చేసింది. దీంతో హ్యాట్రిక్ కాంబోపై మంచి అంచనాలు నెలకొనగా, తాజా టీజర్ తో మరో మ్యూజికల్ హిట్ ఖాయమనే పలువురు చెబుతున్నారు.

అయితే డీజే, నిన్ను కోరి సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కు రెడీ అయ్యాయి. నాని గత సినిమాలన్నీ ఓవర్సీస్ లో ముఖ్యంగా యూఎస్ లో మంచి బిజినెస్ చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి సంగతి ఏమోగానీ అక్కడ మాత్రం బన్నీకి సరైన పోటీనే తగిలేలా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Ninnu Kori  Allu Arjun  Duvvada Jagganadham  

Other Articles