తలైవా రజనీకాంత్ ఓవైపు రోబో 2(2.0) షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. దీంతో తన నెక్ట్స్ చిత్రంపై కూడా దృష్టిసారించబోతున్నాడు. ముంబై మాఫియా నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ హ్యుమా ఖురేషీ హీరోయిన గా నటిస్తుండగా, మరో నాయిక రోల్ వేటలో చిత్ర యూనిట్ ఉంది.
ఇక రజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈ 161వ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. దీంతో ఈ చిత్ర టైటిల్ ను ఆయన అల్లుడు, హీరో ధనుష్ కొద్ది సేపటి క్రితం ఆవిష్కరించాడు. 'కాలా అలియాస్ కరికాలన్' అన్న పేరును పెట్టినట్టు ధనుష్ వెల్లడించాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మెచ్చేలా చిత్రం ఉంటుందని చెబుతున్నాడు.
కాగా, ఈ చిత్రంతో రజనీ రాజకీయ రంగ ప్రవేశం ముడిపడి వుంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమకాలీన రాజకీయ అంశాల ప్రస్తావనతో చిత్ర కథ రూపొందించినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు సముద్రఖని నెగటివ్ రోల్ పోషించబోతున్నాడని టాక్.
#Kaala - Hindi and Telugu #superstar pic.twitter.com/NGjhX2rYqZ
— Dhanush (@dhanushkraja) May 25, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more