Dil Raju Profit with Duvvada Jagannadham Pre Release

Dil raju happy with dj pre release business

Dil Raju, DJ Movie Dil Raju, Dil Raju DJ Profits, Duvvada Jagannadham Pre Release Business, DJ Pre Release Business, Dil raju 20 Crores DJ Movie Satellite Rights, Allu Arjun Dil Raju, Dil Raju DJ Strategy, DJ Movie 80 Crores

Producer Dil Raju bags 20 Crores Profit on DJ Pre Release Business.

డీజే క్రేజ్, దిల్ రాజు ఫుల్ ఖుష్. ఎంత లాభం అంటే...

Posted: 06/15/2017 12:41 PM IST
Dil raju happy with dj pre release business

ఒక నిర్మాతగా కంటే... సినిమాలకు సంబంధించి బిజినెస్ లు చేసి లాభాలు వెనకేసుకోవటంలో దిల్ రాజను కొట్టగలిగే వారే లేరని చెప్పాలి. తన సినిమాలే కాకుండా బయటివాటిని కూడా సక్సెస్ ఫుల్ గా ఆడించి కోట్లకు కోట్లే వెనకేసుకున్నాడు. దువ్వాడ జగన్నాథమ్ సినిమాతో ఆ విషయాన్ని మరోసారి నిరూపించాడు కూడా.

శాటిలైట్ రైట్స్ తోసహా మొత్తం డీజే ప్రీ రిలీజ్ బిజినెస్ 80 కోట్లకు క్లోజ్ అయిపోయింది. కొన్ని ఏరియాల్లో నిర్మాత అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకోగా, మరికొన్ని ఏరియాల్లో సినిమాపై నెలకొన్న బజ్ తో బయ్యర్లు భారీ రేటుకే హక్కులను సొంతం చేసుకున్నారు. ఒకరకంగా సరైనోడు సినిమా ఇంపాక్ట్ (70 కోట్ల బిజినెస్) కూడా దీనిపై ప్రభావం చూపింది.

సినిమాకు పెట్టిన బడ్జెట్ 60 కోట్లు, వచ్చింది 80 కోట్లు. అంటే ఏ రిస్క్ లేకుండానే 20 కోట్లు ప్రాఫిట్ ను రిలీజ్ కు ముందే దిల్ రాజు జేబులో వేసుకున్నాడన్న మాట. అల్లు అర్జున్ పూజా హెగ్డే జోడి తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా హరీశ్ శంకర్ తెరకెక్కించిన డీజే వచ్చే వారమే (జూన్ 23న) రిలీజ్ కానుంది. పాటలు ఆల్రెడీ ఛార్ట్ బస్టర్ లిస్ట్ లో కొనసాగుతున్నాయి కూడా.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Producer Dil Raju  Duvvada Jagannadham  Pre Release Business  

Other Articles