Robo 2 Telugu Rights Fetch Record Price

Record price for robo 2 0 rights

Robo 2.0, 2.0 Movie, Robo 2.0 Telugu Rights, 2.0 Telugu Rights Sai Korrapati, 2.0 Movie Pre Release Business, Robo 2.0 Pre Release Business, Rajini Telugu Business More Than Baahubali

Robo 2.0's Telugu Rights Sold For A Mammoth Amount. Top producer Sai Korrapati Acquired for 60 Crores.

రోబో 2 రైట్స్.. బాహుబలి కంటే ఎక్కువే!

Posted: 06/28/2017 04:29 PM IST
Record price for robo 2 0 rights

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఒక్క తమిళ్ లోనే కాదు సౌత్.. ఆ మాట కొస్తే టోటల్ ఇండియాలోనే భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కోలీవుడ్ కు కాస్త తక్కువైన టాలీవుడ్ లో రజనీ భక్తులకు కొదవేం లేదు. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటూ పోతున్న రజనీ ప్రస్తుతానికి దేశంలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీలో నటిస్తున్నాడంటే, పైగా శంకర్ దర్శఖుడు కావటంతో ఇక్కడి ఫ్యాన్స్ లో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి.

మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోవటంతో ఇప్పుడు బిజినెస్ మీద దృష్టిసారించారు చిత్ర మేకర్లు. హైప్ కు తగ్గట్లుగానే అన్ని భాషల్లో రైట్స్ ను అమ్మేస్తున్నారు. మొన్నే బాలీవుడ్ లో రమారమీ 80 కోట్లకు అమ్మేసినట్లు చెప్పుకున్నాం. ఇక ఇప్పుడు తెలుగులోనూ భారీ లెవల్లో కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. వారాహి చిత్ర అధినేత సాయి కొర్రపాటి 60 కోట్లతో తెలుగు రైట్స్ కొనేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో డీల్ క్లోజ్ చేసేందుకు రెడీ అయిపోతున్నారంట.

బాహుబలి ది కంక్లూజన్ బడ్జెట్, బిజినెస్ మరియు కలెక్షన్లను దృష్టిలో తీసుకున్న శంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ విజువల్ వండర్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇక్కడో విశేషం ఏంటంటే... బాహుబలి పార్ట్ 2 కోలీవుడ్ లో 54 కోట్లకు అమ్ముడుపోగా, రోబో 2.0 60 కోట్లకు అమ్ముడు పోవటం. 2018 రిపబ్లిక్ డేకు మొత్తం 15 భాషల్లో, పైగా 3డీ వర్షన్ లో 2.0 భారీ ఎత్తున్న రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Robo 2.0  Telugu Rights  

Other Articles