దర్శక ధీరుడు రాజమౌళికి నేచురల్ స్టార్ నాని అంటే ఎంత స్పెషల్ బాండింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి ది కంక్లూజన్ ఆడియో వేడుకకు టాలీవుడ్ లో ఉన్న అందరినీ పక్కన పెట్టేసి కేవలం నానికి మాత్రమే ఇన్విటేషన్ పంపించటం, అంతెందుకు బిజీ షెడ్యూలో కూడా నాని కోసం టైం కేటాయించి మజ్నులో కోమియో చేశాడంటే అర్థం చేసుకోవాలి.
ఇదిలా ఉంటే నిన్ను కోరి సినిమా ప్రీ రిలీజ్ పంక్షన్ కు జక్కన్న హాజరైన విషయం తెలిసిందే. సినిమా సక్సెస్ అవ్వాలని ఆశీర్వదించటమే కాదు.. నాని గురించి ఓ రేంజ్ లోనే పొగిడాడు కూడా. ఆ మధ్య సినిమా ట్రైలర్ చూశాక సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడాలని కోరుకుంటూ ఓ ట్వీట్ వేసిన విషయం తెలిసిందే. ఈ కోరికను మన్నించి అందుకు తగ్గట్లే ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు నాని. అయితే అది చూసిన వారంతా సోషల్ మీడియా లో జోకులు పేలుస్తున్నారు.
జంబో టికెట్ ను ప్రజెంట్ గా ఇచ్చిన టీం దాని మీద టికెట్ ధర 150 గా నిర్ణయించింది. సినిమా రిలీజ్ అయ్యేది జూలై 7న, అంటే అప్పటికే జీఎస్టీ అమలు అయిపోయి ధర 200 గా మారిపోయి ఉంటుంది. ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్ ఇంకా పెట్టలేదు కాబట్టి అది కరెక్ట్ కాదు. సో... నాని ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ చెల్లదన్న మాట అంటూ సెటైర్లు వేస్తున్నారు కొందరు. మరో పక్క కోన విషయంలో ఫ్యాన్ కు వార్నింగ్ ఇచ్చి నాని కూడా నానుతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more