సినీ నటి భావన లైంగిక వేధింపుల కేసు చిక్కుముడి వీడింది. ఈ కేసులో పల్సర్ సునీని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు వారాల క్రితం ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ ను విచారించారు. అనంతరం నిన్న(సోమవారం సాయంత్రం) పోలీసులు ఈ స్టార్ మీరోను అరెస్ట్ చేసేశారు.
వాస్తవానికి భావన లైంగిక వేధింపుల ఘటనకు దిలీప్ వివాహం నాడే స్కెచ్ రెడీ అయిందని పోలీసులు గుర్తించారు. 24 నవంబర్ 2016లో దిలీప్, కావ్య మాధవన్ ల వివాహం జరిగింది. ఆ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన భావన.... దానికి హాజరు కాలేదు సరికదా, తీవ్ర వ్యాఖ్యలు చేసిందని వార్తలు వెలువడ్డాయి. దీంతో నొచ్చుకున్న దంపతులు భావనపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వెంటనే ప్రతీకారం తీర్చుకుంటే తామే చేశామన్న విషయం తెలిసిపోతుందని సుదీర్ఘ కాలం వెయిట్ చేశారు.
ఒక కార్పొరేటర్ ను కిరాయికి మాట్లాడుకుని పల్సర్ సునీతో కథ నడిపించారని పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దిలీప్ ను విచారించి, అతని కార్యాలయంలో దాడులు నిర్వహించి, అతని హస్తముందని నిర్థారించుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఫిబ్రవరి 17న ఏం జరిగింది...
కొచ్చిలో ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న నటి భావన గురించి డ్రైవర్ మార్టిన్ పల్సర్ సునికి సమాచారం అందించాడు. ఆ వెంటనే ఈ విషయాన్ని దిలీప్ కు సుని తెలియజేశాడు. ఛాన్స్ మిస్ చేసుకోవద్దని, ఎలాగైనా భావన జీవితాన్ని నాశనం చేయాలని దిలీప్ సునితో చెప్పాడు. ఆపై వాహనంను దారిలోనే కొందరు అడ్డగించి ఎక్కారు. సుమారు రెండు గంటలపాటు లైంగికంగా వేధించడమే కాకుండా, అశ్లీల ఫొటోలూ తీశారు. ఆపై ఆమెను ఇంటికి కాస్త దూరంలో వదిలేసి పారిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పల్సర్ సుని అనే వ్యక్తిని, భావన వాహనం డ్రైవర్ మార్టిన్ సహా మొత్తం ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఈ కేసు వెనుక పలువురు సినీ పెద్దల హస్తముందని గతంలోనే కథనాలు వెలువడ్డాయి. మొదటి నుంచి దిలీప్ పేరు కూడా వార్తల్లో వినిపిస్తూ వస్తోంది. ఇద్దరూ కలిసి సినిమాలు చేసినప్పటికీ, రెండో పెళ్లిని ఆమె వ్యతిరేకించటమే ఈ పనికి కారణమైంది. అయితే జైలు నుంచే పల్సర్ సుని తనను బెదిరిస్తున్నాడంటూ దిలీప్ ఆరోపణలు చేయటంతో పోలీసులకు ఆ అనుమానాలు మరింత ఎక్కువ అయ్యాయి. ఈ నేపథ్యంలో నటుడు దిలీప్‌ను రెండువారాల కిందట పోలీసులు విచారించారు. చివరకు ఆయన ప్రమేయంపై ఆధారాలు లభించడంతో అరెస్ట్ చేశారు.
నన్ను ఇరికించారు...
"నేను అమాయకుడిని. నా నిజాయితీని నిరూపించుకుంటాను. నన్ను మోసంతో ఈ కేసులో ఇరికించారు" అని అలువా సబ్ జైలుకు తరలిస్తున్న సమయంలో దిలీప్ మీడియాతో వ్యాఖ్యానించాడు. నిన్న సాయత్రం దిలీప్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, రహస్యప్రాంతంలో విచారించిన తరువాత అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దిలీప్ అరెస్టుపై కేరళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లోక్ నాథ్ బెహెరా మాట్లాడుతూ, నటిపై కుట్ర వెనుక దిలీప్ హస్తముందని తమ వద్ద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అన్నాడు. కాగా, గత వారంలో ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుల్సార్ సునీని రిమాండ్ కు తరలిస్తుంటే "ఓ పెద్ద షార్క్ దొరకబోతోంది" అని వ్యాఖ్యానించాడు. ఆ తరువాతే దిలీప్ పై విచారణ జరిగింది. దిలీప్ అరెస్ట్ ఇప్పుడు మాలీవుడ్ ను కుదిపేస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more