తన కో హీరోయిన్ల పోటీగానీ, ఎలాంటి వైషమ్యాలు లేకుండా సరదాగా గడిపే నటి సమంత, క్లోజ్ బాండింగ్ మాత్రం చాలా తక్కువ మందితోనే మెయింటెన్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత మరి సెట్స్ లో ఎవరితో బాగా సన్నిహితంగా ఉంటుంది? అన్న డౌట్స్ ను తీరుస్తూ ట్విట్టర్ లో టపీమని సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు చెప్పేసింది.
మహేష్ లో తెలియని క్వాలిటీ గురించి చెప్పమని ఓ అమ్మాయి ట్విట్టర్ లో కోరగా.. మహేశ్ బాబు సెట్స్ లో చాలా సరదాగా ఉంటాడనీ .. సందడి చేస్తాడని చెప్పింది. మహేష్ మాంచి టైమింగ్ తో జోకులు పేలుస్తుంటాడు. ఆయన షూటింగ్ అంటే చాలూ అందరిలో ఏదో తెలియని ఓ ఉత్సాహం వచ్చేస్తుంది. షూటింగ్ బ్రేక్ సమయంలో కో ఆర్టిస్ట్ లతో సరదాగా కబుర్లు చెప్పే మహేశ్ మంచి కంపెనీ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. అయితే కెమెరా ముందుకు వెళ్లగానే మహేష్ టోటల్ గా మారిపోతాడని అంది.
That he's the most entertaining company . I dare you to not laugh if he's in the room . https://t.co/kggGdFE4X6
— Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) July 10, 2017
ఆయన దృష్టంతా చేయబోయే సీన్ పైన .. నటనపైనే ఉంటుందని చెప్పింది. ఆ సమయంలో స్పాట్లో ఎవరూ మాట్లాడుకోవడం, నవ్వుకోవడం లాంటివి చేయకూడదు. చేస్తే మాత్రం ఆయన చిరాకు పడిపోతారంటూ చెప్పుకొచ్చింది. అన్నట్లు మహేష్ కూతురు సితార సమంతకు పెద్ద ఫ్యాన్ అన్న విషయం తెలిసిందే కదా. ఇక సినిమాల విషయానికొస్తే.. మహేష్ స్పైడర్, భరత్ అను నేను తో బిజీగా ఉండగా, సమంత మెర్సిల్, రంగస్థలం 1985 షూటింగ్ లో పాల్గొంటుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more