Mega Hero Maximum Pressure on Baahubali Director

Bunny master plan for jakanna

Rajamouli, Rajamouli Allu Arjun, Jakanna Bunny, Stylish Star Rajamouli, Rajamouli New Movie, Rajamouli Next, DVV Danayya Allu Arjun, Universal Media Rajamouli

Star Heroes Pressure on Rajamouli Next. Allu Arjun is reportedly applying maximum pressure on Rajamouli from all sides to bag his next film.

జక్కన్న కోసం బన్నీ మాస్టర్ ఫ్లాన్, ఎలాగంటే...

Posted: 07/11/2017 04:47 PM IST
Bunny master plan for jakanna

తన తర్వాతి సినిమా విషయంలో దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి క్లారిటీ ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఓ సాదాసీదా కమర్షియల్ ఎలిమెంట్స్ చిత్రంతోనే మన ముందుకు రాబోతున్నాడని ఇప్పటికే ఓ ప్రకటన చేసినప్పటికీ, అది ఎలాంటి జోనర్ మూవీయో తేల్చి చెప్పలేదు. అందుకే స్టార్ హీరోలు సైతం ఆ లిస్ట్ లో తమ పేరు ఉండాలనే కోరుకుంటున్నారు. ఇంకోవైపు బాలీవుడ్ కూడా జక్కన్నపై ఓ కన్నేసి ఉంచింది.

ఇదిలా ఉంటే ఆ మధ్య ఎన్టీఆర్, మహేష్ బాబుల పేర్లు రేసులో వినిపించగా, ఇప్పుడు మరో స్టార్ హీరో పేరు లైన్ లో వచ్చి చేరింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా రాజమౌళితో సినిమా తీయాలనే ఎదురు చూస్తున్నాడంట. ఈ విషయంలో రాజమౌళిపై ఒత్తిడి తెచ్చే యత్నాలు కూడా మొదలుపెట్టాడన్న ఓ వార్త వినిపిస్తోంది.గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా ఏదైనా సరే నిర్మాత మాత్రం డీవీవీ దానయ్యే అన్న విషయంపై ఓ క్లారిటీ వచ్చేసింది. దానయ్య అల్లువారికి మంచి సన్నిహితుడు కావటంతో ఆ దిశగా యత్నాలు మొదలుపెట్టాడనే టాక్.

కానీ, దీనిపై రాజమౌళి ఇంత వరకు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదంట. ముందు స్క్రిప్ట్ వర్క్ అయ్యాకే తారాగణం ఎంపిక చేపడదామని మేకర్లతో ఈ స్టార్ దర్శకుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంకోపక్క అది ఖచ్ఛితంగా ఓ మల్టీ స్టారర్ మూవీయేనని, ఓ బాలీవుడ్ స్టార్ కూడా అందులో యాక్ట్ చేస్తాడని మరో పుకారు వినిపిస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Rajamouli  TollYwood News  

Other Articles