కూతురి బర్త్ డేకి మహేష్ సింపుల్ విషెస్ | Superstar Simple Wishes on Daughter's Birthday

Mahesh babu tweet on daughter bday

Mahesh Babu, MaheshBabu Daughter, Mahesh Daughter Sitara, Sitara Birthday, Mahesh Sitara 5th Birthday, Mahesh Babu Sitara Happy Moments, Mahesh Tweet on Daughter Birthday, Mahesh SPYder Sitara

Tollywood Superstar Mahesh Babu could be a famous actor but beyond that he is a father to two kids, Gautham and Sitara. The loving and cute daughter of Superstar Sitara celebrates her fifth birthday Mahesh Tweet.

తనతో నా ప్రతిరోజూ స్పెషల్‌: సూపర్ స్టార్

Posted: 07/20/2017 11:40 AM IST
Mahesh babu tweet on daughter bday

సినిమాలపై డెడికేషన్ తో పని చేసే మన స్టార్ హీరోలు, ఫ్యామిలీకి ఇచ్చే ప్రయారిటీ కూడా ముచ్చటగొలుపుతుంది. గ్యాప్ ఇచ్చి విదేశాలకు టూర్ లకు వెళ్లటం, అక్కడ కుటుంబ సభ్యులతో సరదాగా గడపటం, ఆ హ్యాపీ మూమెంట్స్ ను చూసి ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతుండటం చూస్తున్నాం. ఈ లిస్ట్ లో ఫస్ట్ లో ఉంటాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్.

మహేశ్‌బాబు గారాల తనయ సితార పుట్టినరోజు ఇవాళ. ఈ సందర్భంగా తన ముద్దుల కూతురికి ట్విట్టర్‌లో మహేశ్‌ స్పెషల్‌ గ్రీటింగ్స్‌ చెప్పారు. 'తను నా ప్రతిరోజును స్పెషల్‌గా మారుస్తుంది. తనకు ప్రత్యేకమైన ఈ రోజున మరింత ప్రేమ, అంతులేని ఆనందం దక్కాలి. నా కూతురు ఐదో వసంతంలో అడుగుపెట్టింది' అంటూ మహేశ్‌ ట్వీట్‌ చేశారు. ఎంత సూపర్ స్టార్ అయినా పిల్లలపై ప్రేమ కుమ్మరించాల్సిందేగా.. అందుకే కూతురితో హ్యాపీగా ఉన్న గడుపుతున్న ఫొటోలను ట్వీట్‌ చేశారు.

 

సితార పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు తాజా చిత్రం 'స్పైడర్‌' టీజర్‌ను విడుదల చేసే అవకాశముందని చెబుతున్నప్పటికీ, అఫీషియల్ గా మాత్రం ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు. మురగదాస్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'స్పైడర్‌' సినిమా వచ్చే సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Sitara  SPYder Teaser  

Other Articles