స్పైడర్ తమిళ్, హిందీ లేదా? | Mahesh Not Interested to Promote Spyder There

Mahesh attend only spyder telugu promotions

Spyder Movie, Spyder Promotions, Spyder Mahesh Babu, Mahesh Babu Spyder Promotions, Mahesh Movie Promotions, Mahesh Skip SPyder Promotions, Mahesh Tamil and Hindi

Mahesh Babu only attend to Spyder telugu version promotions. Appointed Publicity managers for Tamil and Hindi Promotions.

స్పైడర్ ప్రమోషన్.. మహేష్ కండిషన్స్ అప్లై!

Posted: 07/20/2017 06:29 PM IST
Mahesh attend only spyder telugu promotions

మహేష్ బాబు అప్ కమింగ్ మూవీ స్పైడర్ సౌత్ ఇండస్ట్రీలో మరో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కబోతుంది. విజువల్ ఎఫెక్ట్ , కేరింగ్ పేరుతో మురగదాస్ భారీగానే మేకర్లతో ఖర్చుపెట్టించేశాడు దర్శకుడు మురగదాస్. స్టైలిష్ థ్రిల్లర్ డ్రామాకు ప్రీ రిలీజ్ కూడా అదే స్థాయిలో జరిగే ఛాన్సుంది. అయితే టూ క్లాస్ మూవీ అన్న మార్క్ పడిపోతున్నప్పటికీ మాస్ కి కావాల్సిన ఫైట్లు, వగైరా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ తో ఉంది. సో... ఇక మహేష్ ముందున్న గోల్ కలెక్షన్లతో కొత్త రికార్డులు క్రియేట్ చేయటమే.

సాధారణంగా కొంత కాలంగా తన సినిమాల విషయంలో ఎంతో ప్లానింగ్ తీసుకుంటున్న ప్రిన్స్ సినిమాకు సంబంధించి పబ్లిసిటీ విషయంలోనూ ముందుంటున్నాడు. మీడియాలో ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు వగైరా వగైరా అన్నింట్లోనూ ఇన్ వాల్వ్ అవుతున్నాడు. అలాంటిది వంద కోట్ల పై చిలుకు బడ్జెట్ తో తీస్తున్న 'స్పైడర్' సినిమా విషయంలో మాత్రం టాలీవుడ్ వరకు మినహాయింపు ఇచ్చేశాడంట. ఇక్కడ ఒక రేంజ్ లో క్రేజ్ ఉండటంతో సోలోగానే ప్రోసీడ్ అయ్యేందుకు సిద్ధం అయిపోతున్నాడు.

కానీ, తమిళ .. హిందీ భాషల్లో మాత్రం 'స్పైడర్ 'కి పబ్లిసిటీ అవసరమే. అందువలన ఈ సినిమాకి తమిళంలో తగిన ప్రచారం కల్పించడానికి గాను తమిళ మీడియా నుంచి ఓ నలుగురును .. అలాగే బాలీవుడ్ లో పేరు మోసిన ఓ ఐదుగురిని ప్రమోషన్ మేనేజర్లుగా నియమించుకున్నాడంట. ఇందుకుగాను వాళ్లకి మహేశ్ ముట్టజెప్పేది భారీ మొత్తమేనని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Spyder Movie  Hindi and Tamil Promotions  

Other Articles