బాహుబలి మేనియా జనాల మైండ్ లోంచి ఇంకా దిగిపోలేదు. కళ్ల ముందు రాజమౌళి ఆవిష్కరించిన అద్భుతానికి ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకే సినిమా క్రేజ్ ఇప్పటికీ అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. అయితే సినిమాను సినిమాలాగే చూసి ఎంజాయ్ చేయాలే తప్ప.. అందులోని సీన్ లను ప్రేరణగా తీసుకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ముంబైలో సరిగ్గా ఇదే జరిగింది.
బాహుబలి ది బిగినింగ్ లో శివుడు ప్రభాస్ వాటర్ ఫాల్ ఎక్కాలనుకున్న ప్రతీసారి కిందకు జారే సీన్ ఉంటుంది, గుర్తుందా? సరిగ్గా ఓ టూరిస్ట్ లు ఇలాంటి ఫీటే చేయాలని యత్నించి ప్రాణాలు కోల్పోయారు. షాహపూర్ లోని మహులి వాటర్ ఫాల్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బివండికి చెందిన 27 ఏళ్ల ఇంద్రాపాల్ పాటిల్ అనే వ్యాపారి మహులి కోటకు టూర్ కు వెళ్లాడు. సరదాగా స్నేహితులతో ఎంజాయ్ చేస్తుండగా, వాటర్ ఫాల్ నుంచి బాహుబలి అంటూ దూకేశాడు.
అయితే సరిగ్గా రాయి మీద ల్యాండ్ అయ్యే సమయంలో కాలు జారి నీళ్ల అడుగు భాగంకు వెళ్లి మునిగి చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. బాహుబలి రిలీజ్ అయ్యాక ఈ రెండేళ్లలో ఇలాంటి మరణాలు, ప్రమాదాలు చాలానే జరిగాయని స్థానిక పోలీసులు చెబుతున్నారు. సినిమా మొత్తం గ్రాఫిక్స్ తో చేసిందని, పైగా హీరోలు రోప్ ల సాయంతో ఫీట్లు చేస్తారని, విషయం తెలిసి కూడా కొందరు ఫోటోలు, వీడియోలు కోసం యత్నించి ఇలా ప్రాణాలు పోగోట్టుకుంటారని వారంటున్నారు. సో.. ప్లీజ్ డోంట్ ట్రై దిస్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more