సిట్ ముందు రవితేజ.. కిక్కే కిక్కు | Will Mass Raja Reveal Every Thing in SIT Probe

Raviteja appears before special probe team

Raviteja, Raviteja SIT Probe, Raviteja Drug case, Raviteja Confess, Raviteja Drug Case Media, Raviteja Jishan, Raviteja Drug Peddler, Raviteja Reveal SIT Probe, Raviteja Kelvin, Mass Raja Drug Case, Raviteja Media Srug Case

Tollywood Top Hero Raviteja Appears SIT Probe in Drug Case. Mass Raja already booked Jishan's statement.

సిట్ ముందు రవితేజ.. ఒప్పుకోక తప్పదా?

Posted: 07/28/2017 09:54 AM IST
Raviteja appears before special probe team

హీరో రవితేజకు తానే స్వయంగా డ్రగ్స్ ఇచ్చినట్టు సిట్ అధికారుల విచారణలో జిషాన్ వెల్లడించినట్టు గత సాయంత్రం నుంచి వస్తున్న వార్తలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఈ వార్తలను అన్ని మీడియా ఛానెళ్లు, వెబ్ సైట్లు ప్రముఖంగా ప్రచురించడంతో, సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. తనకు ఏ మాత్రం ఈ దందాతో సంబంధం లేదని రవితేజ(తన లాయర్ వద్ద), తన కుమారుడు నిప్పులాంటి వాడని రవితేజ తల్లి రాజ్యలక్ష్మి, ఎలాంటి సంబంధం లేదని కుటుంబ సభ్యులు మొత్తుకుంటున్నా.. అందరి చూపు మాత్రం ఇప్పుడు మాస్ రాజా పైనే ఉంది.

గతంలో సోదరుడు భరత్ డ్రగ్స్ కేసులో దొరికినప్పుడే రవితేజ పేరు వచ్చిందని, అప్పుడు కేసు నీరుగారిపోయిందన్న టాక్ వినిపించింది. ఇక ఇప్పుడు నోటీసులు అందిన నేపథ్యంలో విచారణలో ఆయన ఎటువంటి విషయాలు చెబుతారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇప్పటివరకూ విచారించిన అందరు సినీ సెలబ్రిటీలతో పోలిస్తే, టాప్ హీరో కావటంతో రవితేజను నేడు విచారిస్తుండటంతో, సిట్ కార్యాలయం ఎదుట భద్రతను మరింతగా పెంచారు. ఆయన్ను విచారించాల్సిన అధికారులు కార్యాలయంకు చేరుకుని ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

జిషాన్ దాదాపు కన్ఫర్మ్ చేయటం, కెల్విన్ తో కూడా టచ్ లో ఉన్నట్లు ఆధారాలతో లభించటంతో రవితేజ నిజాలు ఒప్పుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఇంకోపక్క గత రాత్రంతా ఓ స్టార్ హోటల్ లో తన న్యాయవాదులతో చర్చలు జరిపిన హీరో రవితేజ, ఈ ఉదయం నల్లమలపు శ్రీనివాసరెడ్డికి చెందిన కారులో సిట్ కార్యాలయానికి బయలుదేరాడు. ఇంటి నుంచి బయలుదేరిన రవితేజ కారును ఫాలో అవుతున్న మీడియా, ఆ దృశ్యాలను లైవ్ కవరేజ్ లో చూపేందుకు పోటీ పడటం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raviteja  Tollywood  Drug Case  SIT Probe  

Other Articles