Bollywood Director Decides No kissing in His Films Ever

Bollywood director anees bazmee mubarakan interview

Mubarakan, Mubarakan Release, Mubarakan Promotions, Mubarakan Director Interview, Mubarakan Romance, Mubarakan Intimate Scenes, Bollywood Director No Liplocks, No Liplocks Intimate Scenes Director, Mubarakan Director Clean Comedies

No kissing in Anees Bazmee’s film! Mubarakan won’t feature intimate scenes between Arjun Kapoor and Ileana D’Cruz. “My comedies are watched by the entire family, and kids love my humour. I have a mother, a wife and sister at home and I have a daughter. I wouldn’t like to do anything in my films that would make me cringe in front of them. So sorry no, no kissing in my films, ever, no matter what the requirement in the script.

స్క్రిప్ట్ డిమాండ్ చేసినా.. నో లిప్ లాక్స్

Posted: 07/27/2017 05:38 PM IST
Bollywood director anees bazmee mubarakan interview

బాలీవుడ్ లో మరో క్లీన్ కామెడీ ఎంటర్ టైనర్ గా ముబారకన్ రాబోతుంది. సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ లో రిలీజ్ కు రెడీ అయ్యింది. అర్జున్ కపూర్, ఇలియానా లాంటి యంగ్ స్టర్లు ఉండటంతో రొమాన్స్ పాలు ఓ రేంజ్ లోనే ఉంటుందని ఆశిస్తాం. కానీ, సింగిల్ లిప్ లాక్ కూడా లేకుండా చిత్రాన్ని తెరకెక్కించాడంట దర్శకుడు అనీజ్ బాజ్మీ. అది ఎందుకో అతని మాట్లల్లోనే విందాం.

తన సినిమాల్లో స్క్రిప్టు డిమాండ్ చేసినా ముద్దు సన్నివేశాలు మాత్రం ఉండవని చెబుతున్నాడు బాజ్మీ. 'నో ఎంట్రీ', 'వెల్ కమ్', 'సింగ్ ఈజ్ కింగ్', 'రెడీ', 'వెల్ కమ్ బ్యాక్' వంటి సినిమాలు తీసిన అనీస్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా 'ముబారకన్' తెరకెక్కించాడంట. ప్రస్తుతం సినిమా ప్రచారంలో బిజీగా ఉన్న బాజ్మీ బోలెడు విషాలు చెబుతున్నాడు. తన చిత్రాల్లో ముద్దు సన్నివేశాలు పెట్టనని అన్నాడు. తన ఇంట్లో తన తల్లి, చెల్లి, భార్య, కుమార్తె ఉంటారని, వారందరితో కలిసి చూసే విధంగా సినిమాలు రూపొందిస్తానని చెప్పాడు. సినిమా అంటే భారతదేశంలో ఇప్పటికీ ఓ ఫ్యామిలీ ఈవెంట్ లాంటిదేనని, అందుకు తన కుటుంబం ముందు పరువు పోయే సినిమాలు రూపొందించనని స్పష్టం చేశాడు.

ఈ విషయంలో ఎందరో సీనియర్లను తాను ఆదర్శంగా తీసుకుంటానని చెబుతున్నాడు. సల్మాన్ కూడా ముద్దు సీన్లకు అస్సలు ఓకే చెప్పడు. అది చాలా మంచి విషయం. బాలీవుడ్ అంటే ఇంటిమేట్ సీన్లు.. లిప్ లాక్ లు అన్న ధోరణి పోవాలి. అందుకే క్లీన్ గా చిత్రాన్ని తెరకెక్కించానంటున్నాడు ఈ దర్శకుడు. మరోపక్క సోనాక్షి బదులు ఇలియానా ను తీసుకోవటం చాలా మంచిందే అయ్యిందని, అవుట్ పుట్ విషయంలో మంచి ఫలితం రాబట్టగలిగామని చెబుతున్నాడు. రేపే (జూలై 28న) ముబారకన్ రిలీజ్ కానుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mubarakan  Director Anees Bazmee  Ileana D'Cruz  

Other Articles