తారక్ అన్నకు థాంక్స్.. ఫైన్ కట్టడం, సోషల్ మీడియాలో బూతులపై సంపూ వివరణ | Sampoo Clarified on Bigg Boss Fine

Burning star explanation on bigg boss leaving

Sampoo, Sampoo No Fine Bigg Boss, Bigg Boss Issue, Sampoo Bigg Boss Explanation, Bigg Boss Sapoo, Sampoornesh Babu Thanks NTR, Sampoo Facebook, Sampoo Not Fine, Sampoo Bigg Boss Leave Reason

Burning Star Sampoornesh Babu Sorry to viewers for leaving Bigg Boss Show and explained exact reason. He also thanked Junior NTR for full support and clear aired on rumours that he had not need to pay fine to Bigg Boss.

బిగ్ బాస్ వీడటంపై సంపూ సుదీర్ఘ వివరణ

Posted: 07/31/2017 10:53 AM IST
Burning star explanation on bigg boss leaving

బిగ్ బాస్ షో మొదలైనప్పుడు అందులో ఒక్కో సెలబ్రిటీలను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందరి అంచనాలు అతని మీదే. మిగతా వాళ్లలో సీనియర్ సెలబ్రిటీలు ఉన్నప్పటికీ బర్నింగ్ స్టార్ కేవలం 75 శాతం జనాలు షోను చూసేయటం అతిశయోక్తి కాదు. అలాంటిది సంపూర్ణేష్ బాబు తనంతట తానుగా ఎలిమినేట్ చేయాలంటూ పిచ్చెక్కిన వాడిలా చెయ్యటం విస్మయానికి గురిచేసిందే. ఎలాగోలా బిగ్ బాస్ నుంచి బయటపడిన సంపూ చివరకు నిన్న వీకెండ్ ఎపిసోడ్ లో మళ్లీ దర్శనమిచ్చి తన నిష్క్రమణపై ఫ్యాన్స్ కు సారీ చెప్పేశాడు.

అయితే స్టేజీ పై తానిచ్చిన ఫుల్ స్పీచ్ చూడలేని వాళ్ల కోసమంటూ తన ఫేస్ బుక్ పేజీలో కాసేపటి క్రితం ఓ వివరణాత్మక సందేశం ఉంచాడు. నన్ను ఇంతకాలం ఆదరించిన నా ప్రేక్షక దేవుళ్ళకి, అందరి హీరో ల అభిమానులకి, చేతులెత్తి నమస్కరిస్తూ వారికి కృతజ్ఞతలు క్షమాపణలు చెప్తున్నాను అంటూ మొదలుపెట్టాడు. తాను హౌజ్ నుంచి బయటకు వచ్చాక సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతూ కొందరు మెసేజ్ లు, మరికొందరు కల్పిత కథనాలతో లింకులు పెట్టడం చూశాడంట. అవి తనను ఎంతో బాధించాయని అని చెప్పాడు.

క్లాస్తోఫోబియా మూలంగానే తాను బయటకు రావాల్సి వచ్చిందని చెప్పాడు. నాలుగు గదుల రూంలో బంధించబడటం నాకు చాలా కష్టంగా అనిపించింది. అయితే కొందరు పిరికోడు అంటూ నా ప్రోఫెషన్ కు లింకు పెట్టి నన్ను ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు. కానీ, నేనేం అధైర్యపడను. ఏపీ స్టేటస్ కోసం వెళ్లినప్పుడు నన్ను జైలులో పెట్టినప్పుడు కూడా ఫీల్ కాలేదు. కానీ, ఇప్పుడు కొందరు చేసిన కామెంట్లు నన్ను బాధించాయని తెలిపాడు. అలాగే తాను జరిమానా కట్టాలంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపాడు. నన్ను ప్రోత్సహించిన తారక్(జూనియర్ ఎన్టీఆర్) అన్నకు రుణపడి ఉంటానంటూ ఓ సందేశం ఉంచాడు. అది కింద మీకోసం...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh Babu  Bigg Boss Show  Facebook Message  

Other Articles