టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. కొత్త సినిమా ‘ఆచారి అమెరికా యాత్ర’ షూటింగులో భాగంగా యాక్సన్ స్టంట్ లో పాల్గొంటున్న సమయంలో అతడికి యాక్సిడెంట్ జరిగింది. బైక్ రేసు సీన్ షూట్ చేస్తుండగా.. అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. ఆపై ఐసీయూలో విష్ణు అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్ లతో కథనాలు వెలువడ్డాయి. అయితే అతనికి అయిన యాక్సిడెంట్ అంత ప్రమాదకరమైంది కాదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం మలేషియాలోని పుత్రజయ ఆసుపత్రిలో విష్ణు చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి సేఫ్ గానే ఉందని వైద్యులు, కుటుంబ సభ్యులు చెప్పేశారు. ‘దేనికైనా రెడీ’.. ‘ఈడోరకం ఆడోరకం’ లాంటి హిట్లు ఇచ్చిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ చేస్తున్నాడు. గతంలో ‘విక్రమార్కుడు’ సహా పలు భారీ సినిమాలు నిర్మించి.. ఆ తర్వాత గ్యాప్ తీసుకున్న సీనియర్ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి మళ్లీ ఈ చిత్రంతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.
దీనిపై విష్ణు భార్య వెరోనికా, తండ్రి మోహన్ బాబు, సోదరి మంచు లక్ష్మీ ప్రసన్న, సోదరుడు మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. దేవుడి దయవల్ల పెను ప్రమాదం నుంచి తన కుమారుడు బయటపడ్డాడని మోహన్ బాబు తెలిపారు. తమ సోదరుడు కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని లక్ష్మి, మనోజ్ తెలిపారు. గాయపడినా సురక్షితంగా ఉన్నారని చెప్పారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు విష్ణు బైక్ వెనుక హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూర్చుని ఉందని, ఆమెకు ఏం కాలేదని దర్శకుడు బీవీఎస్ రవి తెలిపాడు. మన టాలీవుడ్ హీరో త్వరగా కొలుకోవాలని మనమూ కోరుకుందాం.
Thank you all so much for all your love and concern. Praying for a speedy recovery for Vishnu! God is so so so good!
— Viranica Manchu (@vinimanchu) July 30, 2017
By gods grace...my dear son is safe..
— Mohan Babu M (@themohanbabu) July 30, 2017
With all your love & blessings @iVishnuManchu escaped a serious accident with minor injuries.Nana thanks you all for your calls and concern.
— Lakshmi Manchu (@LakshmiManchu) July 30, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more