లాస్ట్ రెండు సినిమాల కంటే ఎక్కువే.. | NTR Jai Lava Kusa Over Seas Business

Ntr jai lava kusa overseas rights

Young Tiger, Junior NTR, Jai Lava Kusa, Overseas Rights, Record Price, Lava Kusa Business, Jai Lava Kusa Junior NTR, NTR Overseas Business, Lava Teaser Vinayaka Chavithi

Young Tiger NTR’s Jai Lava Kusa overseas rights sold for whopping price. It is now exclusively learnt that the overseas rights has been snapped for 8.5 Crores. A Popular overseas distribution house, which has already bagged the US rights of five upcoming films, has bagged the rights this big budget entertainer. Lava Teaser on Vinayaka Chavithi Officially announced.

జై లవ కుశ ఓవర్సీస్ రైట్స్

Posted: 08/16/2017 02:56 PM IST
Ntr jai lava kusa overseas rights

యంగ్ టైగర్ జై లవ కుశ దసరా బరిలో దిగేందుకు రెడీ అయిపోయాడు. పోటీగా మహేష్ స్పైడర్ వస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రకటించాడు. ఇక ఈ చిత్ర బిజినెస్ భారీగానే జరుగుతుందని సమాచారం అందుతోంది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో మ్యాజిక్ ఫిగర్ బిజినెస్ చేసిన లవకుశ ఓవర్సీస్ లోనూ హయ్యెస్ట్ రేటుకే అమ్ముడు పోయింది. త్వరలో రాబోతున్న ఐదు సినిమాల హక్కులను సొంతం చేసుకున్న ఓ ప్రముఖ సంస్థే ఎన్టీఆర్ సినిమాను కొనుగోలు చేసింది. సుమారు 8.5 కోట్లకు ఈ డీల్ కుదరిందంట. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ రేటుగా చెబుతున్నారు.

గత రెండు చిత్రాలు ఓవర్సీస్ లో భారీ లాభాలను పండించటంతో ఈ ధరకు అమ్ముడు పోయినట్లు చెబుతున్నారు. బాబీ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేధా థామస్, రాశీ ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాముడు కాస్త రావణుడిగా...

 

లవ్ టీజర్ అప్పుడే... 

రెండో క్యారెక్టర్ లవ కుమార్ కు సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ిఇప్పుడు టీజర్ డేట్ ను కూడా అనౌన్స్ చేసింది. ఆగష్టు 25న వినాయక చవితి సందర్భంగా లవ టీజర్ ను వదలనున్నట్లు బ్యానర్ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తన ట్విట్టర్ లో తెలియజేసింది. సమయం ఎప్పుడన్నది త్వరలో తెలియజేస్తామని ఆ ట్వీట్ లో పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Junior NTR  Jai Lava Kusa  Overseas Rights  

Other Articles