సైలెంట్ గా ఉయ్యలవాడ షురూ | Chiranjeevi Uyyalawada Officially Launched

Chiru 151 movie officially launched

Chiranjeevi 151 Movie Launch, Chiru Uyyalawada launch, Chirajeevi Uyyalawada Launch Photos, Uyyalawada Pooja Ceremony, Chiru Charan Uyyalawada, Uyyalawada Launch Silently

Chiranjeevi 151 Movie Uyyalawada Narasimhareddy Launched. The movie team launched the movie officially today with its pooja ceremony.

చిరంజీవి ఉయ్యలవాడ షూటింగ్ మొదలైంది

Posted: 08/16/2017 04:20 PM IST
Chiru 151 movie officially launched

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ఉయ్యలవాడ షూటింగ్ లాంఛ్ అయ్యింది. బుధవారం కొణిదెల ప్రొడక్షన్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 

ఇది కూడా చదవండి... క్లైమాక్స్ కోసం మాస్టర్ ఫ్లాన్

నిజానికి చిరు పుట్టిన రోజు ఆగష్టు 22న షూటింగ్ ను మొదలుపెట్టాలని ముందుగా అనుకున్నారు. అయితే ఆ రోజు మంచి ముహుర్తం లేకపోవటంతో ఇలా హఠాత్తుగా ప్రారంభించేశారు. ఆరోజు చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పూజా కార్యక్రమానికి చిరు దంపతులు, తనయుడు, నిర్మాత రాంచరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, రైటర్స్ పరచూరి బ్రదర్స్, నిర్మాత అల్లు అరవింద్ లు పాల్గొన్నారు.

తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రూపొందించనున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్టు కావటంతో చిరు ప్రతీ చిన్నవిషయాన్ని దగ్గరుండి మరీ చూసుకోనున్నట్లు తెలుస్తోంది. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించబోతున్నాడు. బాలీవుడ్ హీరోయిన్లు ఇందులో చిరు సరసన నటించే అవకాశం ఉంది. రెగ్యులర్ షూటింగ్, కాస్టింగ్ వివరాలు త్వరలో తెలియజేస్తామని నిర్మాత రాంచరణ్ తెలిపారు. 2018 సమ్మర్ లో ఉయ్యలవాడ రిలీజ్ అయ్యే ఛాన్సుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Chiranjeevi  151 Movie  Uyyalawada Narasimhareddy Movie  Movie Launch Photos  

Other Articles