సందీప్ టైం అస్సలు బాగోలేదు.. ఆ చిత్రం రిలీజ్ కూడా డౌటే? | Bad Time Continues for Sandeep Kishan in Kollywood

Maayavan movie release postponed

Sandeep Kishan, Sandeep Kishan Maayavan, Maayavan Movie, Maayavan Postponed, Maayavan Movie Release Date, Sandeep Kishan Movie Postponed

Sandeep Kishan Starrer CV Kumar’s directorial debut Maayavan has been postponed from September 1 due to unknown reasons.

సందీప్ కిషన్ మూవీ మరోసారి వాయిదా

Posted: 08/30/2017 04:16 PM IST
Maayavan movie release postponed

చేతి నిండా సినిమాలు ఉన్నా ఇంత కాలం సక్సెస్ రేటు లేకపోవటం ఒక కారణమైతే ఇప్పుడు సినిమాలు రిలీజ్ కు నోచుకోవటం కూడా చాలా కష్టంగా మారిపోయింది. యంగ్ హీరో సందీప్ కిషన్ పరిస్థితి గురించే ఇక్కడ చెప్పుకుంటుంది. స్టార్ కెమెరామెన్ ఛోటా రిఫరెన్స్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సందీప్ కు అస్సలు టైం బాగోలేదు.

చాలా గ్యాప్ తర్వాత చచ్చి చెడి నక్షత్రం సినిమా రిలీజ్ అయితే అది కాస్త డిజాస్టర్ గా మారింది. తెలుగు సంగతి పక్కన పెడితే తమిళంలో వరుస ఆఫర్లు వస్తున్నా సక్సెస్ రేటు దక్కటం లేదు. ఇక తమిళ్ లో కూడా అతని చిత్రాలు పోస్ట్ పోన్ అవుతుండటం కెరీర్ ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది.

మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన మాయావన్ (తెలుగులో ప్రాజెక్ట్ Z)సెప్టెంబర్ 1న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కారణం తెలీదుగానీ ఈ చిత్రం పోస్ట్ పోన్ అయినట్లు వార్తలు మేకర్లు అనౌన్స్ చేసేశారు. మళ్లీ ఎప్పుడు రిలీజ్ అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు జాకీఫ్రాఫ్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. ఈలోపు తెలుగులో సందీప్ సోలో హీరోగా తెరకెక్కుతున్న కేరాఫ్ సూర్య రిలీజ్ అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maayavan  Kollywood Movie  Release Date  Sandeep Kishan  

Other Articles