వివాదాస్పద అంశాలున్న చిత్రం రిలీజ్ కే అడ్డంకులు ఎదురవుతున్న తరుణంలో.. అసలు ఆ హీరో పైనే లైంగిక వేధింపుల ఆరోపణలు ఉంటే ఇక ఈ చిత్రం పరిస్థితి ఎలా ఉంటుంది?. మాలీవుడ్ హీరో దిలీప్ కుమార్ రామ్ లీలా చిత్రం ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధమైనప్పటికీ అది ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది.
మళయాళ స్టార్ హీరోయిన్ భావన కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో రెండు నెలల కిందట అరెస్టయిన దిలీప్ ఇంకా జైల్లోనే ఉన్నాడు. బెయిల్ కోసం ఇప్పటికే రెండుసార్లు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా, అది తిరస్కరణకు గురైంది. ప్రస్తుతం మూడోసారి బెయిల్ కోసం సీరియస్ గా యత్నిస్తున్నాడు. అది తన కంటే తన చిత్ర నిర్మాతలకే కీలకం కానుంది. కొన్ని నెలల కిందటే పనులన్నీ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో లైంగిక వేధింపుల కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లాడు. 13 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పై నిర్మాతల్లో బెంగ మొదలైంది.
అయితే ఈ నెల 22న సినిమా రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయన్న వార్త నేపథ్యంలో దర్శకుడు అరుణ్ గోపీ స్పందించారు. ఆ వార్తలో నిజం లేదని, సెప్టెంబర్ 28న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే జనాల్లో దిలీప్ నేరం చేశాడని తీవ్రవ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో రామ్ లీల ఎంతమేర విజయం సాధిస్తుందన్నది అనుమానమే. ఇక దిలీప్ కు బెయిల్ లభిస్తే సినిమా ప్రమోషన్లలో పాల్గొనే అవకాశముంది. మహిళా సంఘాలు మాత్రం రామ్ లీలాను అడ్డుకుని తీరతామని చెబుతున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన రామ్ లీలా చిత్రంలో ప్రయాగ రోజ్ మార్టిన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సీనియర్ నటి రాధిక ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more