International Excellence Award to Pawan Kalyan | పవన్ సేవలకు అంతర్జాతీయ పురస్కారం

Pawan kalyan international award

Pawan Kalyan, nternational Award, Pawan UK Award, Pawan Kalyan IEBF International Excellence Award, IEBF International Excellence Award 2017, Janasena Party Chief Pawan Kalyan, Janasena Party Chief International Award

IEBF International Excellence Award to JanaSena Party Chief Shri Pawan Kalyan. Pawan will Receives it Britain Parliament Invest In New India Convention on November 17.

పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం

Posted: 09/25/2017 05:42 PM IST
Pawan kalyan international award

టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం దక్కింది. 2017కు గానూ ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం ఎక్సలెన్స్ అవార్డు (ఐఈబీఎఫ్)కు ఆయన్ని ఎంపిక చేసినట్లు జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఈ సందర్భంగా పార్టీ ఓ రిలీజ్ చేసింది.

పలు రంగాల్లో లబ్ద ప్రతిష్టులైన వారికి ప్రతి ఏటా ఐఈబీఎఫ్ అవార్డును ఇవ్వడం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలోని వేలాది మంది కిడ్నీ వ్యాధి పీడితులను ఆదుకోవడంలో పవన్ కల్యాణ్ చూపిన మానవత్వం, చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచి నేత కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచిన తీరు, సామాజిక సమస్యల పరిష్కారంలో పవన్ చూపుతున్న చొరవ, సుసంపన్నమైన సమాజ స్థాపన కోసం ఆయన చేస్తున్న కృషికి గాను ఈ అవార్డుకు పవన్ కల్యాణ్ ని ఎంపిక చేసినట్టు ఐఈబీఎఫ్ ఇండియా విభాగం ప్రతినిధులు పేర్కొన్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు.

పవన్ ని ఐఈబీఎఫ్ లీడర్ సునీల్ కుమార్ గుప్తా, కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ కలిశారని చెబుతూ ఫోటోను కూడా షేర్ చేశారు. ఈ పురస్కారాన్ని లండన్ లోని బ్రిటన్ పార్లమెంట్ లో నవంబర్ 17న బ్రిటన్ లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ జరగనున్న సమావేశంలో ఇన్వెస్ట్ ఇన్ న్యూ ఇండియా సభలో పవన్ కు అందజేయనున్నట్టు తెలిపారు. తెలుగు విశేష్ తరపున పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles