రణ్‌బీర్ కపూర్‌తో కలిసి పాకిస్థానీ నటి మహీరా ఖాన్ సిగరెట్ తాగుతున్న ఫొటో ఒకటి నెట్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరి బంధం గురించి పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ఫొటో మీద చాలా మంది వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. మహీరా అలా కురచ దుస్తులు ధరించి, సిగరెట్ తాగుతూ మతాన్ని కించపరిచిందని ఇలా రకరకాల కామెంట్లు వినిపించాయి.
మరో పక్క పాకిస్థాన్‌లో మహిళలు మాత్రం మహీరాపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేఫ్ లిక్విటేరియా మాత్రం ఆ వివాదాస్పద ఫొటోను ఇంకో విధంగా వాడుకుంది. తమ పానీయాల ప్రచారం కోసం ఆ ఫొటోలో నుంచి రణ్‌బీర్‌ను తొలగించి మహీరా ఖాన్‌ను మాత్రం వారు ఉపయోగించుకున్నారు. మహీరా తాగుతున్న సిగరెట్‌ను కొద్దిగా పొడవు పెంచి స్ట్రా లాగ కనిపించేలా చేశారు. ఆ స్ట్రాతో ఆమె తమ స్పెషల్ కాఫీని తాగుతున్నట్లుగా చూపించారు.
ఆ ఫొటోను తమ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు తమ స్పందనలు తెలియజేశారు. కొంత మంది ఈ ఐడియాను పొగడ్తలతో ముంచేయగా, మరి కొంతమంది మాత్రం `దిగజారిన మార్కెటింగ్ టెక్నిక్` అంటూ విమర్శించారు. ఏదేమైనా ఈ ప్రచార ఫొటో ద్వారా సద్దుమణిగిన విషయాన్ని ఆ కేఫ్ మళ్లీ తెర మీదకి తీసుకువచ్చినట్లైంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more